Top
logo

మరోసారి కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..

మరోసారి కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..
Highlights

కొమరిన్‌, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. దానికి సమాంతరంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది....

కొమరిన్‌, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. దానికి సమాంతరంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ఉపరితల ఆవర్తనం రాగల 24 గంటల్లో బలపడి అరేబియా సముద్రం పరిసరాల్లో అల్పపీడనం తరువాత వాయుగండంగా మారే అవకాశం ఉందని.. దీని ప్రభావం మాత్రం రాష్ట్రంపై ఉండదని వాతావరణ విభాగం స్పష్టం చేసింది.

మరోవైపు క్యార్ తుఫాను ప్రభావంతో అరేబియా సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. ఈ క్రమంలో చేపల వేటకు వెళ్లోద్దని అధికారులు హెచ్చరించినా జాలర్లు చేపల వేటకు వెళ్లారు. ప్రాణాల్ని రిస్కులో పెట్టి... చేపల కోసం వల వేశారు. ఈ క్రమంలో సముద్రం లోపలకు వెళ్లాక... పరిస్థితి అదుపు తప్పింది.. దాంతో తమకు సాయం అందించాలని కోరారు. రెస్క్యూ ఆపరేషన్ చేసి జాలర్లను ఒడ్డుకు తీసుకువచ్చారు. తాము చెప్పేంతవరకు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.

Next Story


లైవ్ టీవి