Top
logo

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులపాటు వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులపాటు వర్షాలు
Highlights

రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండురోజుల పాటు తేలికపాటు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని కేంద్ర...

రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండురోజుల పాటు తేలికపాటు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణశాఖ గురువారం వెల్లడించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తిరువనంతపురంకు 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కొంకణ్, గోవా, కర్ణాటక ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు కురుస్తాయని, ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గురువారం పుదుచ్చేరిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం వి. నారాయణస్వామి చెప్పారు.

కాగా ఈశాన్య రుతుపవనాలకు తోడుగా అల్పపీడనం ఏర్పడటంతో తమిళనాడులో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఏపీలోని పలు జిల్లాలో రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురిశాయి. కృష్ణా మచిలీపట్నంలో ఎడతెరపిలేని వర్షం కురిసింది. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, పంగులూరు, గిద్దలూరు మండలాల్లో కుండపోత వర్షం కురవగా.. చీరాలలో ఉరుములతో కూడిన జల్లులు పడ్డాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మత్స్యకారులను చేపల వేటకు సముద్రంలోకి వెల్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Next Story


లైవ్ టీవి