మారణాయుధాలను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

మారణాయుధాలను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
x
Highlights

* గత నెలలో అనకాపల్లిలో లోకనాథం అనే వ్యక్తి ఆత్మహత్య * మృతుడి ఇంట్లో మారణాయుధాలు లభ్యం * విచారణ చేపట్టగా ఆన్‌లైన్‌లో ఆయుధాలు విక్రయిస్తున్నట్లు నిర్ధారణ * పలు రాష్ట్రాల్లో నిందితులను అదుపులోకి తీసుకున్న విశాఖ పోలీసులు * విశాఖకు చెందిన బాలగంగాధర్‌కు నిందితులతో లింకులు

మారణాయుధాలను విక్రయిస్తున్న ముఠాను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి గవరపాలంలో గత నెలలో లోకనాథం అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఇంట్లో మారణాయుధాలు లభించాయి. దీంతో మృతుడి మామ శివాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేయగా.. పలు రాష్ట్రాల నుంచి సోషల్‌ మీడియాలో మారణాయుధాలు అమ్మకాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

నాలుగు టీంలుగా ఏర్పడి నిందితులను అరెస్ట్ చేశామని స్థానిక సీఐ భాస్కరరావు తెలిపారు. ఈ నిందితులకు విశాఖకు చెందిన రాజు భాయ్ అలియాస్ బాలగంగాధర్ కు సంబంధం ఉన్నట్లు గుర్తించామని సీఐ వెల్లడించారు. ఈ గ్యాంగ్‌ ఆయుధాలు సప్లై చేయడమే కాకుండా హత్యలు, కిడ్నాపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని సీఐ వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories