ఏరులై పారుతున్న పొరుగు మద్యం

ఏరులై పారుతున్న పొరుగు మద్యం
x
Highlights

పొరుగు రాష్ట్రాల మధ్య ఏరులై పారుతోంది. ఏపీలో మద్యం ధరలు ఎక్కువ కావడంతో ఈ పరిస్థితి వచ్చింది.

పొరుగు రాష్ట్రాల మధ్య ఏరులై పారుతోంది. ఏపీలో మద్యం ధరలు ఎక్కువ కావడంతో ఈ పరిస్థితి వచ్చింది. అయితే వీటిని అన్ని రకాలుగా అక్రమంగా రవాణా చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు విశాఖ ఏజెన్సీ నుంచి పలు రకాలైన ప్లాన్ లతో గంజాయి రవాణా చేస్తుండటం చూస్తున్నాం. అదే తరహాలో ఇప్పుడు మధ్యం అక్రమ రవాణాకు తెరతీశారు. ఇది ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సరిహద్దు మండలాలలో ఇది యధేశ్చగా సాగుతోంది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు విస్త్రుతంగా తనిఖీలు నిర్వహిస్తూ, అక్రమ రవాణా దారులను పట్టుకుంటున్నారు. దీనిలో భాగంగా తాజాగా వాటర్ క్యాన్ల లో ఉంచి మద్యాన్ని సరఫరా చేస్తున్న వ్యవహారాన్ని ఏపీ పోలీసు అధికారులు చేధించారు.

తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రదేశ్ కి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను కృష్ణాజిల్లా అధికారులు పట్టుకున్నారు. కృష్ణాజిల్లా జి.కొండూరు మండలం లోని శివసాయి హోటల్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఆటోలో మద్యం బాటిళ్లను తరలిస్తున్నట్లు గుర్తించారు. తెలంగాణలో తక్కువ ధరకు లిక్కర్ దొరుకుతుండడంతో కూలింగ్ వాటర్ క్యాన్ లో మద్యం బాటిళ్లను తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న 135 మద్యం బాటిళ్లతో ఒక ట్రాలీ ఆటో, ఒక బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఇద్దరిని అరెస్ట్ చేశారు.

కూలింగ్ వాటర్ క్యాన్ తో లిక్కర్ సఫ్లై..!


ఇతర రాష్ట్రాల నుంచే అక్రమ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు కృష్ణాజిల్లా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు. అన్ని రాష్ట్రాల సరిహద్దు చెక్ పోస్ట్ ల వద్ద స్పెష‌ల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో దాడులు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు అక్రమంగా మద్యం తరలిస్తున్న 956 కేసులు నమోదు చేశామన్నారు.. ఇందుకు సంబంధించి 1428 మంది నిందితులను అరెస్టు చేశామన్నా ఎస్పీ.. వీరిలో ఆరుగురు పోలీసులపై కూడా కేసులు నమోదు చేశామని వెల్లడించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తప్పవని రవీంద్రనాథ్ హెచ్చరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories