West Godavari: పోలీసులు పట్టించుకోలేదని సెల్‌టవర్ ఎక్కిన రిక్షావాలా

* తనతో పనిచేసే వ్యక్తులు రాత్రి దాడి చేశారని ఆరోపణ.. తన రిక్షాను లాక్కున్నారని ఆరోపిస్తున్న బాధితుడు

R Tripura Malini
Published on: 5 Dec 2022 12:31 PM IST
Ignored By The Police The Rickshaw Wala Climbs Up The Cell Tower
X

పోలీసులు పట్టించుకోలేదని సెల్‌టవర్ ఎక్కిన రిక్షావాలా

West Godavari: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పోలీసులు తనను పట్టించుకోలేదని ఓ రిక్షావాలా సెల్‌టవర్ ఎక్కారు. భీమవరం ఎమ్మార్వో ఆఫీస్ ప్రాంగణంలో టవర్ ఎక్కాడు వసంతరావు.. తనతో పనిచేసే వ్యక్తులు రాత్రి దాడి చేశారని, తన రిక్షాను లాక్కున్నారని బాధితుడు ఆరోపించారు. పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మనస్తాపానికి గురయి వసంతరావు మద్యం సేవించాడు. రాత్రంతా టవర్‌పైనే రిక్షావాలా వసంతరావు నిద్రపోయారు. కాగా తాగిన మైకంలో సెల్‌టవర్ ఎక్కానని బాధితుడు తెలిపారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది, ఆర్ఐ పోలీసులు వచ్చి సమస్యను పరిష్కరిస్తామని బాధితుడికి భరోసా ఇవ్వడంతో వసంతరావు సెల్‌టవర్ దిగారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story