Amaravati: కరెంట్ కావాలంటే రీఛార్జ్ చేసుకోవాల్సిందే

If you Need Current, you Need to Recharge
x

అమరావతి:(ఫైల్ ఇమేజ్)

Highlights

Amaravti: ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు బిగించాలని ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది

Amaravati: ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సెక్టార్‌కు సంబంధించి విద్యుత్ బకాయిలు కోట్లలో పేరుకుపోతున్ననేపథ్యంలో ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లకు ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్‌ (ముందే బిల్లు చెల్లించే) విద్యుత్‌ మీటర్లు బిగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర అభయాన్‌ పథకంలో భాగంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల్లో వచ్చే ఏడాది మార్చి కల్లా ప్రీపెయిడ్‌ విద్యుత్‌ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుత మీటర్ల స్థానంలో ప్రీపెయిడ్‌ మీటర్లను డిస్కమ్‌లు ఏర్పాటు చేసి వాటి వ్యయాన్ని ప్రతినెలా రెండు శాతం చొప్పున విద్యుత్‌ బిల్లు నుంచి వసూలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు.

ప్రీపెయిడ్‌ విద్యుత్ మీటర్లు అందుబాటులోకి యాప్ ద్వారా బిల్లులు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని విద్యుత్‌ బిల్లులను మొబైల్‌ రీచార్జ్‌లా ముందుగానే రీచార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వాటితోపాటు విద్యుత్‌ చెల్లింపు కేంద్రాల్లో కూడా రీచార్జ్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిసిటీ మీటర్ల వల్ల చాలా చోట్ల బిల్లుల చెల్లింపు ఆలస్యమవుతుండటంతో డిస్కంలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటున్నాయి. దీంతో పాటుగా కోట్లాది రూపాయుల బాకాయిలతో ఈపీడీసీఎల్‌ నష్టాల్లో ఉంది. ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు వస్తే ఆ సమస్యలకు చెక్‌ పెట్టినట్లు అవుతుంది. వినియోగదారులు కూడా సమర్థవంతంగా విద్యుత్‌ వాడుకునేందుకు వీలవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుత అంచనాల ప్రకారం ఈపీడీసీఎల్‌కు అన్ని సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు రూ.6,356.93కోట్లు ఉంది. ఇందులో ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రూ.3,251 కోట్లు ఉన్నాయి. ఇవి కాకుండా వినియోగదారుల నుంచి రూ.1549.11కోట్లు రావాల్సి ఉంది. పరిశ్రమల నుంచి 50 శాతం పైగా బకాయిలు ఉన్నాయి. మరోవైపు విద్యుత్తు కొనుగోళ్లు, బ్యాంకు రుణాలు కలిసి రూ.10,944.27కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories