ఆంధ్రప్రదేశ్ తదుపరి సీఎస్ ఆమేనా?

ఆంధ్రప్రదేశ్ తదుపరి సీఎస్ ఆమేనా?
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎల్వీ సుబ్రహ్మణ్యంను ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. సుబ్రహ్మణ్యంను ఆకస్మికంగా బదిలీ చేస్తూ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎల్వీ సుబ్రహ్మణ్యంను ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. సుబ్రహ్మణ్యంను ఆకస్మికంగా బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ ఉత్తర్వులు కూడా వెంటనే అమల్లోకి వస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. ఆయనను గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా నియమించారు.

అయితే తదుపరి పూర్తిస్థాయి సీఎస్ ఎవరనే చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో కేంద్ర సేవలో పనిచేస్తున్న 1984 బ్యాచ్ ఐఎఎస్ అధికారి నీలం సాహనే, ఏపీకి కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సీఎం కార్యాలయంలోని వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్అధికారుల్లో ఆమె కూడా ఒకరు. సీఎస్ ను నియమించాలంటే ముందుగా సీనియర్ అధికారుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సి ఉంది. కనీసం ఐదు పేర్లను కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. వారిలో ముగ్గురు అధికారులలో ఒకరిని ఎంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తుంది. కేంద్ర ప్రభుత్వ సిఫారసుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త శాశ్వత సీఎస్ ను నియమించుకోవచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories