Pawan Kalyan: టీడీపీ పాలనే బెటర్ అనిపించింది.. పొత్తులపై పవన్ కీలక వ్యాఖ్యలు

I Am Ready To Take The Post Of CM Says Pawan Kalyan
x

Pawan Kalyan: టీడీపీ పాలనే బెటర్ అనిపించింది.. పొత్తులపై పవన్ కీలక వ్యాఖ్యలు

Highlights

Pawan Kalyan: వైసీపీని గద్దె దించడమే జనసేన లక్ష్యం

Pawan Kalyan: ఏపీలో ఎన్నికల హీట్ మొదలైంది. రాబోయే ఎలక్షన్ లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. జనసేన, టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. పొత్తులపై జనసేనాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. భవిష్యత్‌లో టీడీపీ-జనసేన ప్రభుత్వం రావొచ్చని పవన్ వ్యాఖ్యానించారు. లేదంటే టీడీపీ, బీజేపీ, జనసేన ప్రభుత్వమని పవన్ జోస్యం చెప్పారు. పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని.... ఎన్డీఏ పక్షంలో ఏ పార్టీలు ఉంటాయనేది కాలం నిర్ణయిస్తుందన్నారు. ఎన్డీఏ పక్షంలో ఉండి ఓటు చీలకుండా చూసుకుంటామని చెప్పారు. బీజేపీ తమతో కలిసి వస్తుందా లేదా అన్న మీమాంసలోనే పవన్ వ్యాఖ్యలు చేశారా...? అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు టీడీపీ, జనసేనలు ఆప్షన్‌ను బీజేపీకి వదిలేశాయా..? పొత్తులతోనే వైసీపీపై కత్తులు దూస్తామంటున్నారు సేనాని. వైసీపీని గద్దె దించడమే జనసేన లక్ష్యమని పవన్ మరోసారి వ్యాఖ్యానించారు. సీఎం పదవి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించడంతో జనసేనలో జోష్ వచ్చింది. ఎన్నికలయ్యాక ఎమ్మెల్యేల నిర్ణయం ప్రకారమే సీఎం ఎవరనేది ఫైనల్‌ చేస్తామని పవన్ స్పష్టం చేశారు. సహజ వనరులు దోచేస్తు్న్న వైసీపీ నాయకులనే చూస్తే టీడీపీ పాలనే నయమని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories