logo

ఏపీ మాజీ మంత్రి భర్తపై కేసు నమోదు

ఏపీ మాజీ మంత్రి భర్తపై కేసు నమోదు
Highlights

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అఖిల ప్రియా భర్త భార్గవ్ పై గచ్చిబౌలి పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ కేసు విషయంలో భార్గవ్‌ను ప్రశ్నించేందుకు ఆళ్లగడ్డ రూరల్ ఎస్ఐ రమేష్ కుమార్ హైదరాబాద్ వచ్చారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అఖిల ప్రియా భర్త భార్గవ్ పై గచ్చిబౌలి పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ కేసు విషయంలో భార్గవ్‌ను ప్రశ్నించేందుకు ఆళ్లగడ్డ రూరల్ ఎస్ఐ రమేష్ కుమార్ హైదరాబాద్ వచ్చారు. భార్గవ్ ఎస్ఐతో దురుసుగా ప్రవర్తించారు. భార్గవ్ పై పలు కేసులువున్నాయి ఆ కేసుల్లో అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. భార్గవ్ హైదరాబాద్‌లో ఉన్న సంగతి తెలుసుకున్న పోలీసులు‎ అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. భార్గవ్ కారు ఆపకుండా వెళ్లిపోరు. భార్గవ్ కారుతో తనను ఢీకొట్టే ప్రయత్నం చేశారంటూ ఎస్ఐ రమేష్ ఫిర్యాదు చేశారు. దీంతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.


లైవ్ టీవి


Share it
Top