పెళ్లయి 24 ఏళ్లు అయినా భార్యపై తగ్గని భర్త ప్రేమ

*తన భార్య లావణ్యను ఎత్తుకుని 70 తిరుమల మెట్లెక్కిన సత్తిబాబు

Rama Rao
Updated on: 2 Oct 2022 4:07 PM IST
husbands love for his wife in Tirupati | Telugu News
X

పెళ్లైన 24 ఏళ్లైన తర్వాత భార్యపై తగ్గన భర్త ప్రేమ 

Andhra Pradesh: భార్యను ఎత్తుకుని తిరుమలలో 70 మెట్లెక్కాడో వ్యక్తి. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకకు చెందిన లారీ ట్రాన్స్‌పోర్ట్ యజమాని వరదా వీర వెంకట సత్యనారాయణ అలియాజ్ సత్తిబాబు లావణ్య దంపతులకు 1998లో వివాహమైంది. వీరి ఇద్దరమ్మాయిలకూ పెళ్లిళ్లు కూడా చేశారు. వీళ్ళ పెద్ద అల్లుడు చందుకు సాప్ట్‎వేర్ ఉద్యోగం వస్తే పుట్టింటి, అత్తంటి వారందరనీ తిరుమల తీసుకొస్తానన్న తన కూతురి కోరికమేరకు ఇరు కుటుంబాలు తిరుమలలో మొక్కు తీర్చుకునేందకు వెళ్లారు.

ఈసందర్భంగా ప్రతియేటా కాలినడక తిరుమల కొండెక్కే ఈదంపతులు.. ఈసారి తనను ఎత్తుకుని తిరుమల కొండ ఎక్కాలని లావణ్య కోరింది. దీంతో తన భార్య లావణ్య కోరిక మేరకు సత్తిబాబు.. తన భార్యలావణన్యను ఎత్తుకుని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 మెట్లు ఎక్కారు. పెళ్లైన ఇరవై నాలుగేళ్ల తర్వాత సత్తిబాబు తన భార్యపై ఇలా ప్రేమ చూపడాన్ని చూసిపలువురు ఆశ్చర్యపోయారు. తనభార్యను ఎత్తుకుని సత్తిబాబు కొండెక్కుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Rama Rao

Rama Rao

Next Story