కట్టుకున్న భార్యను కత్తెరతో పొడిచి హత్య

కట్టుకున్న భార్యను కత్తెరతో పొడిచి హత్య
x
Highlights

కట్టుకున్న భార్యను కత్తెరతో పొడిచి హత్య కట్టుకున్న భార్యను కత్తెరతో పొడిచి హత్య

కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మంత్రాలయం మండలం కోసిగిలో జరిగింది. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన కేశవ్‌కు, కోసిగికి చెందిన అనితతో కొన్ని సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. పెళ్లైనప్పటి నుంచి కేశవ్ ఏ పనిచేయకపోవడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే దంపతుల మధ్య ఆ గొడవలు మరింత తీవ్రమయ్యాయి.

సంపాదన విషయంలో సోమవారం అర్ధరాత్రి గొడవకు దిగిన కేశవ్.. కత్తెరతో భార్య గొంతులో పొడిచి హతమార్చినట్లు సమాచారం. అనిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. అనిత హత్యతో స్థానికంగా కోసిగిలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లి మరణంతో పండగ పూట ఆమె పిల్లలు తీవ్రంగా రోదిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories