అనంతపురంలో భార్య గొంతుపై కత్తితో దాడి చేసిన భర్త

Husband attacked Wife With Knife in Anantapur
x

అనంతపురంలో భార్య గొంతుపై కత్తితో దాడి చేసిన భర్త

Highlights

*భార్యకు తీవ్ర గాయాలు, చికిత్స కోసం ఆసుపత్రికి తరలింపు

Anantapur: కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా ఆమెపై కత్తితో దారుణంగా దాడి చేశాడో భర్త. అనంతపురంలో నగరంలోని ఆర్ట్స్ కాలేజీలో లెక్టరర్‌గా విధులు నిర్వహిస్తున్న సుమంగళిపై ఆమె భర్త కత్తితో దాడికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. కాలేజీలో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ దాడి జరగడంతో కాలేజీలో ఒక్కసారిగా భయానక వాతావరణం కన్పించింది. కాలేజీ ప్రాంగణంలోనే భార్యపై కత్తితో గొంతుపై దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అలెర్ట్ అయిన విద్యార్థులు, కాలేజీ ఉద్యోగోలు, అధ్యాపకులు దాడిని అడ్డుకున్నారు. కానీ అప్పటికే ఆమె గొంతుకు గాయాలు కావడంతో చికిత్స కోసం హుటాహుటిన అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. భార్యపై దాడికి పాల్పడిన నిందితుడిని కాలేజీ అధ్యాపకులు పోలీసులకు అప్పగించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories