టీటీడీలో భారీగా బదిలీలు

టీటీడీలో భారీగా బదిలీలు
x
Highlights

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో భారీగా బదిలీలు జరిగాయి. ఎన్నడూ లేనివిధంగా పెద్దఎత్తున ఉద్యోగుల బదిలీ జరిగింది. దాంతో కొందరు ఇప్పటికే తమ స్థానాల్లో చేరిపోగా

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో భారీగా బదిలీలు జరిగాయి. ఎన్నడూ లేనివిధంగా పెద్దఎత్తున ఉద్యోగుల బదిలీ జరిగింది. దాంతో కొందరు ఇప్పటికే తమ స్థానాల్లో చేరిపోగా.. మరికొందరు త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.

శ్రీవారి ఆలయ సన్నిధిలో సూపరింటెండెంట్స్‌ గా పనిచేస్తున్న మునిరత్నంను కల్యాణం ప్రాజెక్టుకు, మోహన్‌బాబును దాతల విభాగానికి, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో ఉన్న ఈశ్వర్‌రెడ్డిని, అకౌంట్స్‌ సెక్షన్‌లో ఉన్న సురేష్‌కుమార్‌లను ఆలయ సన్నిధికి బదిలీ చేశారు. తిరుపతి బోర్డు సెక్షన్‌ లో పనిచేస్తున్న సుందరరత్నంను డిప్యూటీఈవో జనరల్‌ విభాగానికి, అయన స్థానంలో రాజేష్‌ను బోర్డు సెక్షన్‌కు బదిలీ చేశారు. అలాగే కల్యాణం ప్రాజెక్టు నుంచి చక్రవర్తిని రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌కు బదిలీ చేశారు.

పద్మావతి విచారణ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్స్‌ గా పనిచేస్తున్న ఆంజినేయులును తిరుమల బోర్డుసెల్‌కు, ఆంజినేయులు స్థానంలో కిరణ్‌ కు బాధ్యతలు అప్పజెప్పారు. అదనపు ఈవో కార్యాలయం నుంచి నిరంజన్‌ను తిరుచానూరు పద్మావతి ఆలయానికి బదిలీ చేశారు. రెవెన్యూ విభాగం నుంచి ఈశ్వరప్రసాద్‌ను వైకుంఠం-1కి పంపారు. ఇక తిరుమల ఆలయ వాహన కీపర్లుగా శివకుమార్‌, మునినాయుడులను నియమించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories