రామానాయుడు ఇంట్లో భారీ చోరీ..

రామానాయుడు ఇంట్లో భారీ చోరీ..
x
Highlights

మాజీ ఎంపీ దివంగత దగ్గుపాటి రామానాయుడు ఇంట్లో భారీ చోరి జరిగింది. తన సొంత గ్రామంలో ఉన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు ఇంట్లో చొరబడి బీభత్సం...

మాజీ ఎంపీ దివంగత దగ్గుపాటి రామానాయుడు ఇంట్లో భారీ చోరి జరిగింది. తన సొంత గ్రామంలో ఉన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు ఇంట్లో చొరబడి బీభత్సం సృష్టించారు. శుక్రవారం అర్ధరాత్రి ప్రకాశం జిల్లా కారంచేడు చినవంతెన సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇంట్లో చొరబడిన దొంగలు బీరువాలు పగులగొట్టి దొరికినకాడికి దోచుకెళ్లారు. ఈ సంఘటన గురించి గ్రామస్తులకు తెలియడంతో ఇక్కసారిగా వారు ఉలిక్కిపడ్డారు. రామానాయుడు ఇంట్లో చోరీనా అంటూ ముక్కున వేలేసుకున్నారు.

ఈ సంఘటనపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం కారంచేడు గ్రామంలో ఉన్న చినవంతెన సెంటర్‌, లైబ్రరీ బజారులో దివంగత రామానాయడు ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న నివాసం ఉంది. ప్రస్తుతం ఆ ఇంట్లో రామానాయుడు సోదరుడు దగ్గుబాటి రామ్మోహన్‌రావు (మోహన్‌బాబు) నివాసం ఉంటున్నారు. వారి కూతుర్లు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. దీంతో రామ్మోహన్‌రావు దంపతులు ప్రతీవారం హైదరాబాద్‌ వెళ్లి తమ కుమార్తెలను చూసుకుని వస్తుంటారు. ఇదే క్రమంలో ఈ నెల 16వ తేదీన వారు హైదరాబాద్‌ చేరుకున్నారు.

ఈ విషయాన్ని గమనించిన దొంగలు ఎవరూ లేని సమయంలో ప్లాన్ చేసుకున్నారు. మెళ్లిగా ఇంట్లో చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. అదే ఇంట్లో కొంత కాలంగా పనులు చేసి జీవనం సాగిస్తున్నా నరసింహారావు, సుజాత దంపతులు శనివారం ఉదయం ఎప్పుడూ లాగానే వచ్చారు. రాగానే ఇంటి ప్రధాన తలుపుల తాళాలు పగులగొట్టి ఉన్నాయి. అది చూసి కంగారు పడిన పనివారు వెంటనే గ్రామంలోనే ఉండే ఆఫీస్‌ మేనేజర్‌ తాళ్లూరి శ్రీనివాసరావుకు సంఘటనకు సంబంధించి సమాచారం అందించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న చీరాల రూరల్ సీఐ జె.శ్రీనివాసరావు, ఒంగోలు నుంచి క్లూస్‌ టీమ్‌తో పాటు స్థానిక పోలీసులు క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories