కాకినాడలో భారీ కొమ్ముకోనాం చేపలు

కాకినాడలో భారీ కొమ్ముకోనాం చేపలు
x
Highlights

రెండు నెలల పాటు చేపల వేటకు మత్స్యకారులు విశ్రాంతి తీసుకున్నారు. నాలుగు రోజుల క్రితం తిరిగి వేట ప్రారంభించారు. అయితే అందరికీ సాధారణమైన చేపలు వలకు తగులు...

రెండు నెలల పాటు చేపల వేటకు మత్స్యకారులు విశ్రాంతి తీసుకున్నారు. నాలుగు రోజుల క్రితం తిరిగి వేట ప్రారంభించారు. అయితే అందరికీ సాధారణమైన చేపలు వలకు తగులు తుంటే కాకినాడ మత్స్యకారులకు లక్ పలికింది. రెండు భారీ కొమ్ము కోనాం చేపలు వారి వలలకు చిక్కాయి. ఇటీవల కాలంలో ఇటువంటి చేపలు వలకు చిక్కడం చూడలేదని మత్స్యకారులు ఆనందంతో చెబుతున్నారు.

మత్స్యకారుల పంట పడింది. సముద్రంలో వేటకు వెళ్లిన వారి వలలకు భారీ కొమ్ము కోనాం చిక్కింది. కాకినాడ పోర్టు ఏరియా కుంభాభిషేకం సముద్రపు రేవులో మత్స్యకారులకు భారీ చేపలు చిక్కాయి. చాలా రోజుల విరామం తర్వాత వేట ప్రారంభించిన మత్స్యకారుల వలకు రెండు భారీ చేపలు దొరికాయి. వీటిని చూసేందుకు జనం ఆసక్తి చూపించారు.

వీటిని బోటు నుంచి పైకి తీసుకు వచ్చిన మత్స్యకారులు వాటి బరువును చూసి ముక్కున వేలేసుకున్నారు. ఒక చేప సుమారు 125 కేజీల బరువుండగా.. మరో చేప 115 కేజీల బరువు ఉండవచ్చని మత్స్యకారులు చెబుతున్నారు. గతంలో ఇంత పెద్ద చేపలను చూడలేదని మత్స్యకారులు అంటున్నారు. ఈ చేపలను కొమ్ము కోనాం అని పిలుస్తారని తెలిపారు. కొమ్ము కోనాంకు మార్కెట్లో భారీగా డిమాండ్ ఉందని అంటున్నారు. దీని ధర సుమారు రూ. 500 నుంచి రూ. 800 వరకు పలుకుతుందని ఆనందం వ్యక్తం చేశారు కాకినాడ రైతులు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories