Top
logo

మళ్ళీ ఉప్పొంగిన గోదావరి.. మొదటి ప్రమాద..

మళ్ళీ ఉప్పొంగిన గోదావరి.. మొదటి ప్రమాద..
X
Highlights

ఎగువన కురుస్తున్న వర్షాలకు మళ్ళీ గోదావరి నది ఉప్పొంగుతోంది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా...

ఎగువన కురుస్తున్న వర్షాలకు మళ్ళీ గోదావరి నది ఉప్పొంగుతోంది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరింది. దాంతో బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. బ్యారేజీ దగ్గర 11.75 అడుగులకు నీటి మట్టం పెరిగింది. దీంతో 175 గేట్లు ఎత్తి 10 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఇటు పోలవరం విలీన మండలాలు చింతూరు, వీఆర్ పురం రహదారులపైకి వరదనీరు చేరింది. దీంతో మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దేవీపట్నం మండలాల్లోని 36 గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో ఆ గ్రామాలన్నింటికీ విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. అలాగే పాపికొండలు విహారయాత్ర కోసం వెళ్లే బోట్లను నిలిపివేశారు.

Next Story