Medical College : ఏపీ పై కేంద్రం వరాల జల్లు..ఇక వైజాగ్‌లో ఇంజినీర్ల కంటే డాక్టర్లే ఎక్కువ కనిపిస్తారేమో!

Medical College : ఏపీ పై కేంద్రం వరాల జల్లు..ఇక వైజాగ్‌లో ఇంజినీర్ల కంటే డాక్టర్లే ఎక్కువ కనిపిస్తారేమో!
x
Highlights

ఏపీ పై కేంద్రం వరాల జల్లు..ఇక వైజాగ్‌లో ఇంజినీర్ల కంటే డాక్టర్లే ఎక్కువ కనిపిస్తారేమో!

Medical College : ఆంధ్రప్రదేశ్ వైద్య రంగానికి కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. విశాఖపట్నం వాసుల దశాబ్దాల కలను నిజం చేస్తూ, అక్కడ మరో కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ప్రస్తుతం ఉన్న ఈఎస్‌ఐఎస్ ఆస్పత్రిని పూర్తిస్థాయి మెడికల్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీ వేదికగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో అధికారిక ప్రకటన వెలువడటంతో ఉత్తరాంధ్ర ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

విశాఖలో వైద్య విద్యకు కొత్త ఊపిరి

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో వైద్య సేవలను మరింత విస్తృతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 10 ఈఎస్‌ఐ లేదా ఈఎస్‌ఐసీ ఆస్పత్రులను మెడికల్ కాలేజీలుగా మార్చాలన్న కేంద్ర కార్మిక శాఖ ప్రణాళికలో విశాఖపట్నానికి చోటు దక్కింది. ప్రస్తుతం వైజాగ్‌లో ఉన్న ఈఎస్‌ఐసీ ఆస్పత్రిని మెడికల్ కాలేజీగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం చాలాకాలంగా కోరుతోంది. ఇప్పుడు ఆ విన్నపాలకు సానుకూల స్పందన రావడంతో, అప్‌గ్రేడేషన్ పనులు ప్రారంభం కానున్నాయి.

రాజ్యసభలో కేంద్ర మంత్రి ప్రకటన

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. జాతీయ వైద్య మండలి నిబంధనలకు అనుగుణంగా విశాఖపట్నంలోని ఈఎస్‌ఐఎస్ ఆస్పత్రిని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే జనవరి నెలలో కేంద్ర బృందం విశాఖలో పర్యటించి ఆస్పత్రిలోని వసతులను క్షుణ్ణంగా పరిశీలించింది. ఆ బృందం ఇచ్చిన సానుకూల నివేదికతోనే ఈ ప్రాజెక్టు ముందుకు కదులుతోంది.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఏపీ ప్రభుత్వం పూర్తి మద్దతు ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆస్పత్రిని ఈఎస్‌ఐసీ సంస్థకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఆస్పత్రి నిర్వహణ, సిబ్బంది సర్దుబాటు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై కేంద్రంతో రాష్ట్ర అధికారులు నిరంతరం చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రం నుంచి ఈ ప్రక్రియ అధికారికంగా ముగియగానే, మెడికల్ కాలేజీ పనులు వేగవంతం కానున్నాయి.

మెరుగుపడనున్న వైద్య సేవలు

ప్రస్తుతం ఈఎస్‌ఐసీ ఆస్పత్రి 200 పడకల సామర్థ్యంతో కార్మికులకు, సాధారణ ప్రజలకు సేవలు అందిస్తోంది. దీనిని మెడికల్ కాలేజీగా మార్చడం వల్ల పడకల సంఖ్య పెరగడమే కాకుండా, స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులోకి వస్తారు. మరోవైపు, విశాఖలోని షీలా నగర్‌లో 400 పడకలతో భారీ ఈఎస్‌ఐసీ ఆస్పత్రి నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ రెండు అందుబాటులోకి వస్తే విశాఖపట్నం వైద్య రంగంలో దక్షిణ భారత దేశంలోనే కీలక కేంద్రంగా మారనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories