దిశ యాప్ ఎలా పనిచేస్తుంది.. దిని ప్రత్యేకతలు ఏంటి ?

దిశ యాప్ ఎలా పనిచేస్తుంది.. దిని ప్రత్యేకతలు ఏంటి ?
x
Highlights

రాష్ట్ర మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే దిశా చట్టాన్ని ప్రవేశపెట్టింది.

రాష్ట్ర మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే దిశా చట్టాన్ని ప్రవేశపెట్టింది. అంతేకాకుండా దిశా అనే ప్రత్యేకమైన యాప్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ఎలా పనిచేస్తుంది. దిని ప్రత్యేకతలు ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం.


ఎలా ఉపయోగించుకోవాలి :

* ఈ యాప్ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫాంలపై పనిచేస్తుంది. దీనికి ఇంటర్నెట్ ఉన్నా లేకున్నా సంబంధం లేదు. ఎలా అయిన వాడొచ్చు..

* మొబైల్ లో ఈ యాప్ ని ఆన్ చేసి ఎస్‌ఓఎస్‌ (SOS) అనే బటన్‌ నొక్కితే ఆ ఫోన్‌ లొకేషన్‌ యొక్క వివరాలు, ఆ ఫోన్‌ నెంబరు ఎవరి పేరు మీద ఉందొ వంటి చిరునామాలన్నీ పోలీస్ కంట్రోల్‌ రూంకి వెళతాయి.

* ఒకవేళ ఎస్‌ఓఎస్‌ (SOS) ద్వారా సమాచారం ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఫోన్‌ను అటు ఇటు గట్టిగా ఊపినా కంట్రోల్ రూంకి క్షణాల్లో సమాచారం వెళ్తుంది.

* అంతేకాకుండా మొబైల్ ఏ లోకేషన్‌లో ఉందొ 10 సెకన్ల నిడివిగల వీడియో, ఆడియో కూడా కంట్రోల్‌ రూంకి చేరతాయి. ఎందుకంటే ఆ ఆడియో వీడియో ద్వారా బాధితురాలు ఎక్కడ ఉందొ కనిపెట్టేందుకు ఇవి ఉపయోగపడతాయి.


* ఇక ఆ యాప్ లో ' ట్రాక్‌ మై ట్రావెల్‌' అనే ఒక ఆప్షన్‌ ఉంటుంది. 'ట్రాక్‌ మై ట్రావెల్‌' ఆప్షన్‌లో బయల్దేరిన ప్రదేశం, ఎక్కడికి వెళుతున్నారో నమోదు చేయాలి. అప్పుడు వెళ్తున్న మార్గాన్ని కంట్రోల్‌ రూం నుంచి గమనిస్తారు. ఆ తర్వాత అక్కడినుంచి వేరే మార్గంలోకి ఆటో లేదా క్యాబ్‌లో వెళుతుంటే ఆ మార్గంలోని పోలీస్ స్టేషన్ లకి అప్రమత్తం చేస్తూ ఓ మెసేజ్ వెళుతుంది.

* ఆపదలో ఉన్న మహిళలు ఈ యాప్‌లోని SOS బటన్ ప్రెస్ చేయగానే ఈ సమాచారాన్ని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కి అందిస్తారు. దగ్గరలోని పోలీస్ వాహనాలకు కంట్రోల్ రూం నుండి ఆటోమేటిక్‌గా కాల్ డిస్పాచ్ విధానంలో పంపిస్తారు. జీపీఎస్‌ అమర్చిన పోలీసు రక్షణ వాహనాల్లో 'మొబైల్‌ డాటా టెర్మినల్‌' ఉంటుంది కాబట్టి వాహనం ఉన్న ప్రాంతం నుంచి ఆ సందేశం వచ్చిన ప్రాంతం వరకు రూట్‌ మ్యాప్‌ కనిపిస్తుంది.. దీనిని బట్టి ఆ వాహనం ఆ ప్రాంతానికి చేరుకోవచ్చు.


ప్రత్యేకతలు :

* ఈ యాప్‌లో పోలీసు అధికారుల ఫోన్‌ నంబర్లతో పాటు పోలీసుస్టేషన్ల వివరాలు తెలుసుకోవచ్చు..

* ఈ యాప్‌ ద్వారా 100/112 నంబర్లకు సహాయం కోసం ఫోన్‌ చేసుకోవచ్చు.

* దీనిని మహిళలతో పాటు వృద్దులు కూడా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ఎమర్జెన్సీ సమాచారాన్ని పంపించేందుకు ఎవరివైనా ఐదు నెంబర్లు నమోదు చేసుకోవచ్చు. ఆపదలో ఉండి, ఎస్‌ఓఎస్‌ (SOS) అనే బటన్‌ నొక్కి సందేశం పంపినప్పుడు పోలిసులతో పాటు ఈ అయిదు నంబర్స్ కూడా ఈ సమాచారం వెళ్తుంది.

* ఈ యాప్ లో సామాజిక మాధ్యమాలు, రోడ్డు భద్రత, వైద్య అవసరాలు లాంటి ఎన్నో ఆప్షన్లును కూడా పొందుపరిచారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories