విద్యార్థుల్లో మేధాశక్తిని వెలికి తీయాలి

విద్యార్థుల్లో మేధాశక్తిని వెలికి తీయాలి
x
ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్
Highlights

వికలాంగులు తమకు కలిగిన వైకల్యానికి బాధపడకుండా దాగి వున్న మేధాశక్తిని వెలికి తీసి సాధించాలనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పేర్కొన్నారు.

ముమ్మిడివరం: వికలాంగులు తమకు కలిగిన వైకల్యానికి బాధపడకుండా దాగి వున్న మేధాశక్తిని వెలికి తీసి సాధించాలనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక అంబేద్కర్ భవనంలో ఉషోదయ మండల వికలాంగుల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాటి వారి పట్ల జాలి చూపించే పరిస్థితులు ప్రస్తుత రోజుల్లో కరువయ్యాయి అన్నారు. భగవంతుడిచ్చిన అంగవైకల్యానికి బాధపడకుండా తమలో దాగివున్న తెలివితేటలు, మేధాశక్తికి పదును పెడితే నిర్దేశించుకున్న గమ్యాన్ని సునాయాసంగా చేరుకోవచ్చు అన్నారు. అంగవైకల్యం అనేది గమ్యానికి అడ్డుకాదని, ఆత్మస్థైర్యంతో లోపాలను సరిదిద్దుకుని రాణించి ఉన్నత పదవుల్లో కొలువులు పొందినవారు ఎంతో మంది ఉన్నారన్నారు.

ప్రతి ఒక్కరూ బాగా చదువుకుంటే వికలాంగులు తమకు ఉన్న లోపాన్ని జయించే శక్తి ఉత్పన్నమవుతుంది అన్నారు. అనంతరం ముగ్గురు వికలాంగులకు ట్రై సైకిల్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ధీరుభాయి అంబానీ వికలాంగుల పాఠశాల చిన్నారులు చేసిన ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకర్షించాయి. తాళ్ళరేవు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వికలాంగులకు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయ్ తామస్, వైకాపా రాష్ట్ర నాయకులు దున్న జనార్దన్ రావు, కుడుపూడి శివన్నారాయణ, దొమ్మేటి శ్యామల్ సాగర్, మండల అధ్యక్ష కార్యదర్శులు కాదా గోవింద్ కుమార్ , రాయుడు గంగాధర్, నాయకులు దడాల జగదీశ్వరరావు, రెడ్డి నాగేశ్వరరావు, దవులురి సత్యనారాయణమూర్తి , రేవు మల్లేశ్వరి, మధు, తదితరులు పాల్గొన్నారు.Show Full Article
Print Article
More On
Next Story
More Stories