logo

హోదా ఇచ్చేది లేదంటున్న బీజేపీ..మరి జగన్ హోదా ఎలా తెస్తారు?

హోదా ఇచ్చేది లేదంటున్న బీజేపీ..మరి జగన్ హోదా ఎలా తెస్తారు?
Highlights

హోదాకోసం పారాడతామని చెప్పిన వైసీపీ ఇప్పుడు పోరు మళ్లీ మొదట్నుంచి మొదలు పెట్టిందా?అడిగి తప్ప సాధించలేని ఈ...

హోదాకోసం పారాడతామని చెప్పిన వైసీపీ ఇప్పుడు పోరు మళ్లీ మొదట్నుంచి మొదలు పెట్టిందా?అడిగి తప్ప సాధించలేని ఈ డిమాండ్ ను వైసీపీ ఎలా సాధిస్తుంది?

ఏపీ కి జరిగిన విభజన నష్టాన్ని ప్రత్యేక హోదా తప్ప మరేదీ భర్తీ చేయలేదని స్పష్టం చేస్తూ ఏపీ అసెంబ్లీ మరోసారి తీర్మానం చేసింది. సీఎంగా జగన్ అధికారం చేపట్టాక చేసిన తొలి తీర్మానం ఇది. ఇక హోదాపై రాష్ట్ర ప్రభుత్వ పోరాటంలో లెక్క చూస్తే ఇది మూడో తీర్మానం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఓసారి ఎన్నికలకు ముందు మరోసారి హోదాపై తీర్మానం చేసి పంపింది. అప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉంది ఇవాళ వైసీపీ అధికార పక్షంలో ఉండి మరోసారి తీర్మానం చేసింది. ఏపీకి హోదా ఇచ్చి తీరాల్సిందేనంటున్న జగన్ దానికోసం పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. అడగాల్సిన టైమ్ లో టీడీపీ అడగకపోవడం వల్లనే రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందంటున్నారు సీఎం జగన్ టిడిపి నేతలు స్వార్ధ ప్రయోజనాల కోసం ప్యాకేజీకి కక్కుర్తి పడబట్టే హోదా రాలేదన్నారు.

మొన్నటి నీతీ ఆయోగ్ వేదిక పైనా తన ఏడు నిమిషాల సమయాన్ని జగన్ హోదా ప్రస్తావనకే వినియోగించారు. హోం మంత్రి అమిత్ షాను కలిశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షగా హోదా ఇవ్వాలని దీనికోసం మోడీ మనసు కరిగించాలనీ వేడుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నన్నాళ్లూ హోదా అంశంపై దూకుడుగా పోరాడిన వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆచి తూచి, నిదానమే ప్రధానంగా అడుగులేస్తోంది. డిమాండ్ స్థానంలో రిక్వెస్ట్ చోటు చేసుకుంది. హోదా కోసం తాము చేసే పోరాటం సుదీర్ఘమైనదని వైసీపీ చెబుతూ వస్తోంది. అధికారం లోకి వచ్చాక జగన్ హోదా సాధనలో టీడీపీ వైఫల్యాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. ప్రణాళికా సంఘాన్ని హోదా ఇమ్మని వెంట పడాల్సింది పోయి మళ్లీ ప్రధానిని కలిసి వ్యవహారాన్ని మొదటికి తెచ్చారన్నారు. చంద్రబాబు అధికారం చేపట్టిన ఏడునెలల వరకూ ప్రణాళికా సంఘం దగ్గర హోదా సజీవంగానే ఉందన్నారు. టీడీపీ ఆ విషయం ఆలోచించకుండా తప్పు దారి పట్టిందని అన్నారు.

టీడీపీ వైఫల్యాన్ని ఎత్తిచూపిన వైసీపీ మరి హోదా కోసం ఎలా పోరాడుతుంది? పార్లమెంటులో వైసీపీ పోరు దీక్ష చేస్తూనే ఉంటుందన్నారు కేంద్రంతో విభేదించి,డిమాండ్ చేసి హోదా తెచ్చుకునే ఆస్కారం లేదు. కేంద్రాన్ని ఇమ్మని ప్రాధేయ పడటం మినహా మరో మార్గం లేదు.

వైసీపీ హోదా పోరు ఇలా సాగుతుంటే హోదా అన్నది ముగిసిన అధ్యాయమని బీజేపీ రాష్ట్ర నేతలు పదే పదే చెబుతున్నారు. హోదా సాధన అని వైసీపీ చెప్తే అది మోసగించడమేనంటోంది బీజేపీ.

హోదా అన్నది మరిచిపోయి పూర్తి స్థాయి నిధులు తెచ్చుకుని రాష్ట్రాభివృద్ధి చేసుకోమని బీజేపీ పెద్దలు చెబుతున్న సలహా పైగా వైసీపీకి బీజేపీయే సరైన ప్రత్యామ్నాయమని కమలనాథులు చెప్పడం చూస్తుంటే వైసీపీకి సెంటర్ లో దోస్తీ రాష్ట్రంలో కుస్తీ తప్పదా? చంద్రబాబు ఓటమికి, జగన్ తిరుగులేని గెలుపుకి కారణమైన హోదాపై బీజేపీ అదే నిర్లక్ష్యపు పోకడలు పోతే సమీప భవిష్యత్తులో ఆ పార్టీకి ఏపీలో ఒక్క సీటు కూడా రాదు అలాగని హోదా ఇచ్చినా బీజేపీ అధికారంలోకి వస్తుందని గ్యారంటీగా చెప్పలేని పరిస్థితి. ఏదేమైనా హోదా కోసం జగన్ కేంద్రం మెడలు ఎలా వంచుతారన్నదే ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న అదనుకోసం వేచి చూస్తున్న టీడీపీ వైసీపీకి పోరాటంలో సహకరిస్తామని చెప్పడం చూస్తుంటే ఈ గెలుపు నినదాన్ని ఎవరూ అంత సులభంగా వదిలిపెట్టరని అర్ధమవుతోంది.


లైవ్ టీవి


Share it
Top