ఉగాది నాటికి అర్హులందరికీ పక్కా గృహాలు

ఉగాది నాటికి అర్హులందరికీ పక్కా గృహాలు
x
ఆర్డిఓ ఉమాదేవి
Highlights

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు అర్హులైన ప్రతి పేదవానికి, ఇంటి స్థలాలు మంజూరు చేస్తున్నామని ఆత్మకూరు ఆర్డిఓ ఉమాదేవి పేర్కొన్నారు.

ఉదయగిరి: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు అర్హులైన ప్రతి పేదవానికి, ఇంటి స్థలాలు మంజూరు చేస్తున్నామని ఆత్మకూరు ఆర్డిఓ ఉమాదేవి పేర్కొన్నారు. జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గురువారం ఉదయగిరి పర్యటనను పురస్కరించుకొని, జరుగుతున్న ఏర్పాట్లను ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మెరిట్స్ కళాశాలలో శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కలిసి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం, స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... రాబోయే ఉగాది నాటికి ఆత్మకూరు డివిజన్ పరిధిలో, ఇళ్ల స్థలాల పంపిణీకి 19,490 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీ నిమిత్తం 489 ఎకరాల్లో, ప్రభుత్వ భూములను గుర్తించామన్నారు. మరో రెండు రోజుల్లో ఇళ్ల నిర్మాణాల కొరకు గుర్తించిన స్థలాలను, ఉపాధి హామీ నిధుల ద్వారా చదును చేయడం జరుగుతుందన్నారు. అలాగే ఇటీవల ఉదయగిరి పర్యటనకు వచ్చిన కలెక్టర్ కు, ప్రజల నుండి వచ్చిన అర్జీల పై తహసీల్దార్ తో సమీక్షించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బీమా ప్రసాదు, రెవిన్యూ సిబ్బంది ఉన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories