నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు కేటాయింపు

నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు కేటాయింపు
x
పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
Highlights

రాష్ట్రంలో రూ.25 లక్షల మంది నిరుపేదలకు మార్చి 31వ తేదీలోగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని, ఎందుకోసం సీఎం జగన్మోహన్ రెడ్డి రూ.14 వేల కోట్లు కేటాయించారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు.

గుడివాడ: రాష్ట్రంలో రూ.25 లక్షల మంది నిరుపేదలకు మార్చి 31వ తేదీలోగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని, ఎందుకోసం సీఎం జగన్మోహన్ రెడ్డి రూ.14 వేల కోట్లు కేటాయించారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. నందివాడ మండలం పోలుకొండ గ్రామంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామాలు పట్టణాల్లో ఇల్లు లేక నిరుపేదలు ఉండడానికి వీల్లేదని అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. రాష్ట్రంలో రూ.45 వేల పాఠశాలలను హౌస్ ఆధునికీకరిస్తామన్నారు. తొలివిడతగా మౌలిక వసతుల కల్పనకు రూ.3,600 కోట్లు కేటాయించామన్నారు. టీడీపీ హయాంలో పాఠశా లల బాగోగులను పట్టించుకోలేదని కేవలం నామమాత్రపు నిధులను ఆధునికీకరణకు వినియోగించడం జరిగిందన్నారు.

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాం అన్నారు. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సీఎం జగ న్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. అమ్మఒడి పథకం ద్వారా అర్హులకు ఏటా రూ.15వేల చొప్పున ఐదేళ్ల పాటు ఆర్థిక సాయాన్ని అందజేస్తామన్నారు. వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న పేదలకు వర్తింపజేశామన్నారు. 1000 దాటిన ప్రతి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుం దని మంత్రి కొడాలి నాని అన్నారు. వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ మాట్లాడుతూ నందివాడ మండలం లో గత ఆరు నెలల కాలంలో రోడ్ల నిర్మాణాని కి 7 కోట్ల డ్రైవర్ల నిర్మాణానికి. రూ.5 కోట్లు నిధులను ఖర్చు చేస్తున్నామన్నారు.

పోలుకొండ గ్రామంలో 846 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.40 లక్షలు నిధులను మంజూరు చేశారని జనవరి నెలలో పనులు ప్రారంభం అవుతాయి అన్నారు. శంకర పాడు గ్రామంలో రూ.61 లక్షలతో డ్రైన్లు నిర్మిస్తున్నామన్నారు. నందివాడ మండలానికి ఆర్ డబ్ల్యు ఎస్ నిధులు రూ.33 లక్షలు మంజూర య్యాయి అన్నారు. భవిష్యత్తులో మండలానికి మరిన్ని నిధులు మంత్రి కొడాలి నాని సహకారంతో తీసుకువచ్చి అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలియ జేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories