అనంతపురం జిల్లాలో ఇళ్ల పట్టాల పంచాయితీ.

అనంతపురం జిల్లాలో ఇళ్ల పట్టాల పంచాయితీ.
x
Highlights

* బొమ్మనహల్‌ మండలం దేవగిరిలో బీజేపీ, వైసీపీ ఘర్షణ * అర్హుల పేర్లు జాబితాలో లేకపోవటంతో చెలరేగిన వివాదం * బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన బీజేపీ * బీజేపీ నేతలతో వాగ్వాదానికి దిగిన వైసీపీ నేతలు

అనంతపురం జిల్లా బొమ్మనహల్‌ మండలం దేవగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీపై వివాదం చెలరేగింది. అర్హులైన ఇద్దరి పేర్లు జాబితాలో లేవంటూ బీజేపీ నేతలు లేఅవుట్ దగ్గర ఆందోళనకు దిగారు. అదే సమయంలో వైసీపీ నేతలు అక్కడికి రావటంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.ఈ దాడిలో బీజేపీ నేత హీరోజీరావు గాయపడ్డారు.

2018లో గ్రామానికి చెందిన గుండమ్మ, లక్ష్మిలకు 5 సెంట్ల స్థలంలో అధికారులు పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ తర్వాత ఇళ్ల పట్టాల పంపిణీ కోసం లే అవుట్ వేసేందుకు ప్లాట్లు తీసుకున్నారు. ఆ సమయంలో తమ స్థలం లాక్కోవద్దని మొర పెట్టుకోగా.. అధికారులు, వైసీపీ నేతలు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే తాజాగా వచ్చిన జాబితాలో తమ పేర్లు లేకపోవటంతో..లేఅవుట్ లోని తమ స్థలాల్లో ముళ్ళ కంపలు వేశారు.

ఇక సమాచారం అందుకున్న అధికారులు లే అవుట్‌కు చేరుకోగా.. బీజేపీ నేతలు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంతలోనే అక్కడకు వెళ్లిన వైసీపీ నేతలు, కార్యకర్తలు బీజేపీ నేతలకు అడ్డుతగిలారు. మీకేం సంబంధం అంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. పోలీసులు, అధికారుల సమక్షంలో రెండు పార్టీల కార్యకర్తలు దాడి చేసుకున్నారు.

పూర్తి వివరాలు ఇవీ..

అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దేవగిరి లో బిజెపి నాయకుడు హీరోజీరావు పై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. గ్రామంలో గతం లో ఇళ్ల పట్టాలు పొందిన ఇద్దరు మహిళలకు అన్యాయం జరిగిందని ఇళ్ల పట్టాల పంపిణీ లే అవుట్ వద్ద బిజెపి నాయకులు బాధితులకు అండగా రెవెన్యూ అధికారులతో చర్చించారు. విషయం తెలుసుకున్న వైసిపి నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకొని వారితో వాగ్వాదానికి దిగారు అనంతరం ఎస్ ఐ సమక్షం లొనే వారి పై దాడికి పాల్పడ్డారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని అక్కడినుంచి చెదరగొట్టారు. వివరాల్లోకి వెళితే

బొమ్మనహల్ మండలంలోని దేవిగిరి గ్రామంలో 111, a3c సర్వే నంబర్లు లో 109 ఇంటి పట్టాలు ఇవ్వడానికి అధికారులు లే ఔట్ సిద్ధం చేశారు. గ్రామానికి చెందిన గుండమ్మ, లక్ష్మి లకు ఇదే సర్వే నంబర్ లో 5 సెంట్ల స్థలం లో 2018 సంవత్సరంలో రెవెన్యూ అధికారులు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. లే ఔట్ వేస్తున్న సమయంలో మా ప్లాట్లు లాక్కోవద్దని మొరపెట్టుకున్నారు. మీకు న్యాయం చేస్తామని అధికారులు, వైసిపి నాయకులు చెప్పారని బాధితులు తెలిపారు. ఈ నెల 25న పట్టాలు ఇస్తున్న తరుణంలో గుండమ్మ, లక్ష్మి పేర్లు జాబితాలో లేకపోవడంతో వారి స్థలాలలో వేసిన లేఅవుట్ లో రాళ్లకు నంబర్ ను తొలగించి ముళ్ళ కంపలు వేశారు. వైసిపి నాయకులు వాలెంటర్ల్లు, రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం అందించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న బిజెపి నేతలు వసుంధరాదేవి, హీరోజిరావు తదితరులు గుండమ్మ లక్ష్మి లకు న్యాయం చేయాలని తహసీల్దార్ అనిల్ కుమార్ ని డిమాండ్ చేశారు. అంతలో వైసిపి నాయకులు రాజకుమార్, అతని అనుచరులు అడ్డుతగిలారు. మీకేం సంబంధం అంటూ వాగ్వాదానికి దిగారు ఈ సందర్బంగా బీజేపీ నేత హీరోజీరావు పై దాడికి పాల్పడ్డారు. ఎస్సై రమణారెడ్డి ఆందోళనకారులను అడ్డుకున్నారు. దాడి అనంతరం బీజేపీ నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories