తూర్పుగోదావరిలో హౌస్ షిఫ్టింగ్

తూర్పుగోదావరిలో హౌస్ షిఫ్టింగ్
x
Highlights

రోడ్డు వైడింగ్‌ పడగొట్టాల్సిన భవనం కానీ వెనక్కి జరిగింది. విస్తరణకు అడ్డురాలేదు బిల్డింగ్ పడగొట్టలేదు 35 అడుగులు వెనక్కి వెళ్లింది రెండు నెలల క్రితం...

రోడ్డు వైడింగ్‌ పడగొట్టాల్సిన భవనం కానీ వెనక్కి జరిగింది. విస్తరణకు అడ్డురాలేదు బిల్డింగ్ పడగొట్టలేదు 35 అడుగులు వెనక్కి వెళ్లింది రెండు నెలల క్రితం ప్రారంభమైన హౌస్ షిఫ్టింగ్ పూర్తయింది.

తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం - కాకినాడ పోర్ట్ ఏడీబీ రోడ్డు నాలుగులేన్లు రోడ్డుగా విస్తరణ జరుగుతోంది. ఏడీబీ రోడ్డులో రంగంపేట సెంటర్లో రోడ్డుకు చాలా దగ్గరగా అనుకుని రెండు అంతస్తుల భవనం ఉంది 20 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ భవనాన్ని కూల్చడానికి ఇష్టం లేక రెండు నెలల క్రితం భవన యజమాని పోతుల రామకుమార్ చెన్నై కు చెందిన ఓ సంస్థ ఈ బిల్డింగ్ వెనక్కి షిఫ్ట్ంగ్ చేసే పనిని అప్పగించారు.

గత రెండు నెలలుగా మూడొందల యాభై వరకూ జాకీల సాయంతో భవనాన్ని వెనక్కి నెడుతున్నారు. ఒక్కో అడుగు వెన్నక్కి జరుపుతూ.. రోడ్డు భాగం నుంచి 35 అడుగుల వెనక్కి భవనం నెట్టిన తర్వాత అక్కడ కొత్త పునాదులు తీసి దానిమీద భవనం కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. ఇలా కొత్తగా పునాదులకు వేసిని ఫల్లర్లకు భవనానికి వున్న ఫిల్లర్లను అతికించారు. భవనం పనులు జరుగుతున్న సయంలో కూడా యజమాని అందులోనే కుటుంబంతో సహా అందులోనే నివసిస్తున్నారు.

భవనం ఒక చోట నుంచి ఇంకో చోటకి మార్చినా భవనానికి ఒక్క బీట పడలేదు విద్యుత్ లైన్ తొలగించలేదు వాటర్ పైపులు పాడవలేదు బోరు కూడా అలాగే ఉంది ఎలాంటి ఇబ్బంది లేకుండా భవనాన్ని షిఫ్ట్ చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories