'వైఎస్సార్‌ నవశకం' నేడు ప్రారంభం.. ఇదే సరైన నిర్ణయం..

వైఎస్సార్‌ నవశకం నేడు ప్రారంభం.. ఇదే సరైన నిర్ణయం..
x
Highlights

నేటినుంచి పల్లెలు, పట్టణాల్లో 'వైఎస్సార్‌ నవశకం' ప్రారంభం కానుంది. అర్హులైన ప్రజలందరికీ సంక్షమ పథకాల ఫలాలు అందించేందుకు వాలంటీర్లు ఇంటింటి సర్వే...

నేటినుంచి పల్లెలు, పట్టణాల్లో 'వైఎస్సార్‌ నవశకం' ప్రారంభం కానుంది. అర్హులైన ప్రజలందరికీ సంక్షమ పథకాల ఫలాలు అందించేందుకు వాలంటీర్లు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. నెలరోజులపాటు జరగనున్న ఈ సర్వేలో రోజుకు ఐదు ఇళ్ల చొప్పున వివరాలు నమోదు చేసుకుంటారు.. వాలంటీర్లు తోపాటు సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం సచివాలయ ఉద్యోగులు, రిసోర్స్‌ పర్సన్లతో పాటు మండల స్థాయి అధికారులందరూ కలిపి దాదాపు 4 లక్షల మంది రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వేలో పాల్గొంటారు. కుల, మత, ప్రాంతం, పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా లబ్ధిదారులను ఎంపిక చేయడం ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రధానంగా బియ్యం కార్డు, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కార్డు, వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ కార్డు, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా వసతి కార్డుల కోసం లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. ఈ సర్వే ఆధారంగా చాలా వరకు బోగస్ రేషన్ కార్డులు ఏరివేయబడతాయి.

కేంద్ర ప్రభుత్వం రూల్ ప్రకారం వార్షికాదాయం రూ. 60 వేలు ఉంటే తెల్ల రేషన్ కార్డుకు అర్హులు.. కానీ ఈ నిబంధన సరిగా అమలు కావడం లేదు. దాంతో ఇబ్బడి ముబ్బడిగా తెల్ల రేషన్ కార్డులు సృష్టించబడ్డాయి. అంతేకాదు లక్షలాది బోగస్ కార్డులు కూడా ఇందులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ సహా ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు సైతం ఈ తెల్ల రేషన్ కార్డు మీదే ఆధారపడి ఉన్నాయి. చాలా మంది రేషన్ బియ్యాన్ని చౌకదరల దుకాణం నుంచి తక్కువ రేటుకు తీసుకొని ఆ బియ్యం మరియు ఇతర వస్తువులను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. ఇది చాలా ఏళ్లుగా జరుగుతోంది. ఈ కారణంగా ప్రభుత్వం కొన్ని వందల కోట్ల రూపాయల మేర నష్టపోతోంది.ఈ క్రమంలో వారి ఆటలు కట్టించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ రూల్ ప్రకారం కాకుండా.. వార్షికాదాయాన్ని రూ. లక్షా 80 కు పెంచి.. వారికి మాత్రమే తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది.

అలాగే రూ.2 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఫీజు రీఎంబర్స్మెంట్ కార్డు, రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో రూ. లక్షా 80వేలు పైబడిన వారికి రేషన్ నిలిపివేయడం వలన వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మిగులుతాయి. వచ్చే ఏడాది నుంచి రేషన్ బియ్యం మీద ఆధారపడి బ్రతికే వారికి నాణ్యమైన బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిద్వారా నాణ్యమైన బియ్యాన్నే ఇవ్వడం ద్వారా లబ్ధిదారులు బయట మార్కెట్లో బియ్యాన్ని కొనకుండా ఖర్చులు తగ్గించుకోవచ్చు. ఇది చాలా మంచి నిర్ణయమే అయితే.. ఈ సర్వే మొహమాటాలకు పోకుండా కచ్చితంగా నిర్వహిస్తే మాత్రం లబ్ధిదారులకు మేలు జరుగుతుంది. అలా కాకుండా వాలంటీర్లు, ఇతర అధికారులు అక్రమార్కులతో కుమ్మక్కైతే మాత్రం సర్వే చేసి ఉపయోగం ఉండకపోవచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories