విజయవాడలో కలెక్టర్, పోలీస్ అధికారులు, సీనియర్ నేతలతో హోంమంత్రి సమావేశం

Home Minister Meeting With Collector, Police officers and Senior Leaders in Vijayawada
x

విజయవాడలో కలెక్టర్, పోలీస్ అధికారులు, సీనియర్ నేతలతో హోంమంత్రి సమావేశం 

Highlights

*నవంబర్ 1న A1 కన్వెన్షన్ హాల్‌లో వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డ్స్

Vijayawada: విజయవాడలోని A1 కన్వెన్షన్ హాల్లో కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు, ఇతర శాఖల అధికారులు, వైస్సార్సీపీ సీనియర్ నాయకులతో హోంమంత్రి తానేటి వనిత సమావేశమయ్యారు. నవంబర్ 1న A1 కన్వెన్షన్ హాల్ లో వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డ్స్ కార్యక్రమం జరగనుంది. వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డ్స్ కార్యక్రమ ఏర్పాట్లను హోంమంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన భద్రత, ఇతర పనులను ఆమె పరిశీలించారు. వైఎస్సార్ అవార్డ్స్ కార్యక్రమం రెండవ ఏడాది నిర్వహిస్తున్న తరుణంలో మరింత ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విద్య, వైద్యం, మహిళా శిశు సంక్షేమం, మీడియా వంటి వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి వైఎస్సార్ అవార్డ్స్ ఇస్తున్నట్లు హోంమంత్రి పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories