Andhra Pradesh: కరోనా పేషెంట్లకు హోం ఐసోలేషన్ సెంటర్లు

Home Isolation Centers for Covid Patients in Andhra Pradesh
x

హోం ఇసోలేషన్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Andhra Pradesh: విజయవాడ వాంబేకాలనీలో టిడ్కో గృహాలలో ఐసోలేషన్‌ సెంటర్లు

Andhra Pradesh: కోవిడ్‌ విజృంభిస్తున్న వేళ ఏపీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పేషెంట్ల కోసం హోం ఐసోలేషన్ల సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. విజయవాడ వాంబేకాలోని టిడ్కో గృహాలలో హోం ఐసోలేషన్‌ సెంటర్లను ప్రారంభిస్తోంది. ఇద్దరు కరోనా పేషంట్లకు కలిపి ఓ రూమ్‌ను ఇవ్వనున్నారు అధికారులు. అదేవిధంగా కోవిడ్‌ రోగులకు ఫ్రీ చెకప్‌, ఫ్రీ మెడిసిన్‌తోపాటు ఫ్రీ ఫుడ్‌ను అందజేయనుంది ప్రభుత్వం. రేపటి నుంచి ఈ హోం ఐసోలేషన్‌ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక హోం ఐసోలేషన్‌ సెంటర్లలో జాయిన్‌ అవ్వడానికి మొదట 104కి కాల్‌ చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని కోవిడ్‌ పేషెంట్లకు అధికారులు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories