దివ్య తేజశ్వి హత్య కేసులో అనుమానాలు!

దివ్య తేజశ్వి హత్య కేసులో అనుమానాలు!
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన దివ్యతేజశ్విని హత్య కేసులో అసలేం జరింగిది..? నాగేంద్ర, దివ్యల మధ్య సంబంధం నిజమేనా..? వారిద్దరి మధ్యా సంబంధం ఉందనడానికి ఆరుగురు సాక్షులు ఉన్నారని షాకిచ్చిన నాగేంద్ర మాటల్లో నిజమెంత..?

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన దివ్యతేజశ్విని హత్య కేసులో అసలేం జరింగిది..? నాగేంద్ర, దివ్యల మధ్య సంబంధం నిజమేనా..? వారిద్దరి మధ్యా సంబంధం ఉందనడానికి ఆరుగురు సాక్షులు ఉన్నారని షాకిచ్చిన నాగేంద్ర మాటల్లో నిజమెంత..? దివ్యను హత్య చేసింది నాగేంద్ర ఒక్కడేనా.. ఇంకెవరి ప్రమేయమైనా ఉందా..? హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ..

బెజవాడలో సంచలనం సృష్టించిన దివ్యతేజశ్వి హత్య కేసు అనుమానాలు ఇంకా వీడలేదు. దివ్యను హత్య చేసాడంటూ నాగేంద్రను అరెస్టు చేసిన దిశ పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నల వర్షం కురిపించారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు కూడా నాగేంద్రనే హంతకుడు అన్నాయి. అయితే నాగేంద్ర, దివ్యల మధ్య సంబంధం ఉంది అనడానికి ఆరుగురు సాక్షులు ఉన్నారని ఏసీపీ నిర్థారించడం చర్చనీయాంశమవుతోంది.

మరణించిన తమ కూతురుకు న్యాయం చేయమన్నారు సరే.. కానీ నాగేంద్ర వాళ్ళకు తెలీకుండానే ఇంటి దారి తెలుసుకున్నాడా? అర కిలోమీటరు కూడా దూరం లేని రెండు ఇళ్ళ మధ్య ఎలాంటి పరిచయాలు లేవా? దివ్య తేజస్విని హత్యలో నాగేంద్ర నిందితుడని తేలే లోపు, అసలు నాగేంద్ర ఎవరో తెలీదన్న దివ్య తలిదండ్రులు, నాగేంద్ర పేరుతో సహా నొక్కి అతడే హంతకుడని ఎలా చెప్పారు. ఇలా దివ్య తేజశ్వి హత్య కేసులో అన్నీ ప్రశ్నలే.

మరోవైపు కోర్టు నాగేంద్రకు 14 రోజుల రిమాండు విధించిన తర్వాత పోలీసులు కష్టడీకి ఎందుకు అడిగారనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. విచారణలో గంటకో సమాధానం మార్చాడన్న పోలీసులు, కస్టడీకి ఇస్తే విచారణ చేసేస్తారా? నాగేంద్ర చెపుతున్న ఆరుగురు సాక్షుల వివరాలు ఏవీ అన్న ప్రశ్నకు సమాధానాలు లేవు. కానీ రిమాండ్ రిపోర్ట్, ఛార్జ్ షీటు దాఖలయ్యాయి. మరి నాగేంద్ర తరఫు లాయర్ ఎవరు అన్న ప్రశ్నకూ సమాధానం లేదు.

నాగేంద్రే హంతకుడు అని టెక్నికల్‎గా నిర్ధారణ అయ్యాక, ఆ ఆరుగురు ఏం చెప్పారు? నాగేంద్రకు శిక్ష పడుతుందా? ఎలాంటి డిఫెన్స్ వాదనలు జరుగుతాయి? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈనెల 20 దాకా వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories