ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న తిరుమల కొండ

X
Highlights
* వైకుంఠ ఏకాదశి సందర్భంగా పోటెత్తిన భక్తులు * రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం * ఒక్క రోజే రూ.4.3కోట్ల హుండీ ఆదాయం * లాక్‌డౌన్ తర్వాత అత్యధికంగా హుండీ ఆదాయం
admin26 Dec 2020 2:45 AM GMT
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు.. దాంతో శుక్రవారం రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం వచ్చింది. లాక్‌డౌన్ తర్వాత స్వామి వారికి తొలిసారి అత్యధికంగా హుండీ ఆదాయం వచ్చింది. శుక్రవారం ఒక్కరోజే శ్రీవారికి 4.3 కోట్లు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, ఈ నెల మొత్తంగా చూసుకున్నట్లయితే.. ఐదుసార్లు 3 కోట్లు దాటింది. ఇప్పుడు అంతకు మించి ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. కాగా, లాక్‌డౌన్ తర్వాత అత్యధికంగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్టు తెలిపారు.
Web TitleHighest hundi in Thirumal temple after lockdown
Next Story