చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తత.. టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు కారు ధ్వంసం

X
టీడీపీ ఎంమ్మెల్సీ దొరబాబు
Highlights
*సర్పంచ్ అభ్యర్థిని కారుతో ఢీకొట్టారంటూ వైసీపీ నేతల దాడి *ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు *పేర్నంబట్టు సర్పంచ్ అభ్యర్థి తరపున.. *నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన ఎమ్మెల్సీ దొరబాబు
Samba Siva Rao31 Jan 2021 11:26 AM GMT
చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. యాదమర్రి మండల కేంద్రంలో టీడీపీ, వైసీపీ శ్రేణులు ఘర్షణకు దిగారు. తమ సర్పంచ్ అభ్యర్థిని కారుతో ఢీకొట్టారంటూ టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబుపై వైసీపీ నేతలు దాడికి దిగారు. కారును ధ్వంసం చేశారు. పేర్నంబట్టు సర్పంచ్ అభ్యర్థి తరపున నామినేషన్ దాఖలు చేసేందుకు ఎమ్మెల్సీ దొరబాబు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆందోళనకారులను చెదరగొట్టారు. విషయం తెలుసుకున్న ఇరుపార్టీల కార్యకర్తలు.. ఘటనాస్థలానికి భారీగా చేరుకుంటున్నారు. మరోవైపు గాయపడ్డ వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని ఎమ్మెల్యే ఎం.ఎస్. బాబు పరామర్శించారు.
Web TitleHigh-tension In Chittoor District
Next Story