ఆశా వర్కర్ మృతి: గుంటూరు జీజీహెచ్‌లో ఉద్రిక్తత

X
జీజీహెచ్ ఫైల్ ఫోటో
Highlights
గుంటూరు జిల్లా జీజీహెచ్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Samba Siva Rao24 Jan 2021 9:31 AM GMT
గుంటూరు జిల్లా జీజీహెచ్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆశావర్కర్ విజయలక్ష్మి మృతి చెందడంతో ఆశావర్కర్లు ఆందోళనకు దిగారు. నిరసన చేపడుతున్న ఆశావర్కర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలి కుటుంబసభ్యులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబానికి రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని, ఇంట్లో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వాలని ఆశావర్కర్లు డిమాండ్ చేశారు. ఈ సమయంలో జీజీహెచ్ వద్దకు వచ్చిన గుంటూరు కలెక్టర్, జేసీ ఎటువంటి హామీ ఇవ్వకుండా వెళ్లిపోవడంతో ఆశావర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ శామ్యూ్ల్‌తో ఆశా కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఒక్కసారిగా జీజీహెచ్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
Web Titlehigh tension at ggh in guntur
Next Story