నేడు మరోసారి హై పవర్‌ కమిటీ సమావేశం.. వారిపైనే చర్చ..!

నేడు మరోసారి హై పవర్‌ కమిటీ సమావేశం.. వారిపైనే చర్చ..!
x
Highlights

రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై జీఎన్‌ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ (బీసీజీ)...

రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై జీఎన్‌ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ (బీసీజీ) నివేదికపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన హై పవర్‌ కమిటీ నేడు మరోసారి సమావేశం కానుంది. అమరావతిలోని crda కార్యాలయంలో కమిటీ సభ్యులు భేటీ అయి రెండు నివేదికలపై చర్చించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కమిటీ మెంబర్‌ కన్వీనర్‌ నీలం సాహ్ని నేతృత్వంలో ఈ కమిటీ ఇదివరకే సమావేశం అయింది. అయితే మూడు రోజుల వ్యవధిలో మరోసారి భేటీ అవుతోంది. అమరావతిలో జరుగుతున్న ఆందోళనల దృష్ట్యా ఇవాళ్టి మీటింగ్‌లో దీనిపైనే చర్చించనున్నట్లు తెలుస్తోంది.

అమరావతిలో రైతులకు ఎలా న్యాయం చెయ్యాలి? గత ప్రభుత్వం ఏయే హామీలతో భూములు సేకరించింది? ఆ హామీలను ఎలా నిలబెట్టాలి? రైతులకు ప్లాట్లు ఇవ్వాలా వద్దా అనే అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. మొత్తం పదిమంది మంత్రులు, సీఎం ముఖ్య సలహాదారు, ఐదుగురు సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు ఈ హై పవర్‌ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కాగా ఇప్పటికే జీఎన్‌ రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ (బీసీజీ) తమ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాయి. రెండు కమిటీలు కూడా అభివృద్ధి వికేంద్రీకరణకే మొగ్గు చూపాయి.

గతేడాది ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజు రాజధానిపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ రాష్ట్రానికి అవసరం ఉందని అన్నారు. బహుశా ఆంధ్రప్రదేశ్‌కు దక్షిణాఫ్రికాకు తరహాలో మూడు రాజధానులు ఉంటాయేమో.. అమరావతిలో లెజిస్లేచర్ క్యాపిటల్, విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడీషియల్ క్యాపిటల్ కావొచ్చని వ్యాఖ్యానించారు. దీంతో అప్పటినుంచి అమరావతిలో అగ్గి రాజుకుంది.

రాజధాని నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన భూములను ఏమి చేస్తారని అన్ని రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. తెలుగుదేశం, జనసేన పార్టీలు అమరావతిలోని రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం మద్దతు పలుకుతున్నాయి. అమరావతిలో రైతుల ఉద్యమం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న బందరు(మచిలీపట్టణం)లో జోలె పట్టి నిధులు సేకరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories