ఏపీ డీజీపీకి షాక్.. శుక్రవారం హైకోర్టులో హాజరు కావాలని ఆదేశం

ఏపీ డీజీపీకి షాక్.. శుక్రవారం హైకోర్టులో హాజరు కావాలని ఆదేశం
x
ఏపీ డీజీపీకి షాక్.. శుక్రవారం హైకోర్టులో హాజరు కావాలని ఆదేశం
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సావాంగ్‌‌కు హైకోర్టు షాకిచ్చింది. ఫిబ్రవరి14న శుక్రవారం కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సావాంగ్‌‌కు హైకోర్టు షాకిచ్చింది. ఫిబ్రవరి14న శుక్రవారం కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఇద్దరు వ్యక్తుల మిస్సింగ్ కేసులో ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశించింది. 2 రోజుల గడువు ఇచ్చిన కోర్టు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది.

ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన రెడ్డి గౌతమ్, ఎల్లేటి లోచిని పోలీసులు అరెస్టు చేశారని ఆరోపించారు. అయితే పోలీసులు తమను అన్యాయంగా అరెస్టు చేశారంటూ గతంలో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. రెడ్డి గౌతమ్, ఎల్లేటి లోచి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. విశాఖపట్నం సీనియర్ సివిల్ జడ్జిని జ్యుడీషియల్ విచారణ జరపాలని నియమించింది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం విశాఖ సీనియర్ సివిల్ జడ్జి న్యాయ విచారణ పూర్తి చేశారు. అనంతరం ఆయన నివేదికను హైకోర్టులో సమర్పించారు.

విశాఖపట్నం సీనియర్ సివిల్ జడ్జి నివేదికను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం నివేదిక అంశాల ఆధారంగా ఏపీ డీజీపీ గౌతమ్ సావాంగ్‌ను ఫిబ్రవరి 14వ తేదీన ధర్మాసనం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. దీనిపై సంబంధిత పూర్తి వివరాలతో వివరణ ఇచ్చేందుకు సిద్ధం కావాలని హై కోర్టు స్పష్టం చేసింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories