ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక ప్రకటన

X
Highlights
* నిమ్మగడ్డను ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు కలవాలన్న కోర్టు * నేటి నుంచి మూడు రోజుల్లోపు ఎస్‌ఈసీతో చర్చించాలని ఆదేశం * రాష్ట్రంలో కరోనా కారణంగా ఎన్నికలు జరపలేమంటున్న ప్రభుత్వం..
Sandeep Eggoju29 Dec 2020 6:50 AM GMT
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక ప్రకటన చేసింది. నేటి నుంచి మూడ్రోజుల్లోపు ఎస్‌ఈసీ నిమ్మగడ్డను ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు కలవాలని సూచించింది. రాష్ట్రంలో కరోనా కారణంగా స్థానిక ఎన్నికలు జరపలేమంటున్న ప్రభుత్వం.. ఆ వివరాలను నిమ్మగడ్డకు వివరించాలని ఆదేశించింది. ఎక్కడ కలవాలనే విషయాన్ని నిమ్మగడ్డ చెబుతారని తెలిపింది. అప్పటికీ.. ప్రభుత్వం, ఎస్‌ఈసీ మధ్య చర్చలు కొలిక్కి రాకపోతే తిరిగి వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది.
Web TitleHigh Court key statement on local body election 2020 conduct in Andhra Pradesh
Next Story