ఏపీ డీజీపీపై హైకోర్టు ఆగ్రహం

ఏపీ డీజీపీపై హైకోర్టు ఆగ్రహం
x
Highlights

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో పోలీస్ వ్యవస్థ గాడితప్పుతోందని ఈ సందర్బంగా కోర్టు వ్యాఖ్యానించింది..

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో పోలీస్ వ్యవస్థ గాడితప్పుతోందని ఈ సందర్బంగా కోర్టు వ్యాఖ్యానించింది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అనే వ్యక్తి అదృశ్యం కేసులో బాధితుడి మేనమామ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. అయితే వెంకటరాజు విషయంలో పోలీసుల తీరు సరిగా లేదని.. గతంలో మూడు సార్లు జుడిషియల్ విచారణ చేస్తే పోలీసులదే తప్పని తేలిందంటూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఏపీలో రూల్ ఆఫ్ లా సరిగా అమలు కావడం లేదని మండిపడింది. పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ రాజీనామా చేయాలనీ కూడా తీవ్ర పదజాలం వాడింది హైకోర్టు. గతంలో డీజీపీని పలు మార్లు కోర్టుకు పిలిపించినా మార్పు రాలేదని.. ప్రతిసారి ఇలాంటి పరిస్థితే ఎదురవుతే ప్రభుత్వం ఇబ్బందులపాలయ్యే అవకాశం ఉందని.. ప్రతి కేసులో సీబీఐ విచారణ సాధ్యం కాదని హైకోర్టు అభిప్రాయపడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories