మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ తొలగింపుపై విచారణ సోమవారానికి వాయిదా

మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ తొలగింపుపై విచారణ సోమవారానికి వాయిదా
x
Nimmagadda ramesh kumar
Highlights

ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది.

ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది.ప్రభుత్వం జారీ చేసి ఆర్డినెన్స్‌, జీవోలపై హైకోర్టులో దాఖలైన 6 పిటిషన్లపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హైకోర్టు విచారణ చేపట్టింది. గురువారం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

తదుపరి విచారణను ఏప్రిల్ 20(సోమవారం)కి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలుకు నెల రోజుల గడువు ఇవ్వాలని ప్రభుత్వ తరపు లాయర్ కోరారు. సోమవారం సాయంత్రంలోగా పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాదికి అందించాలని హైకోర్టు ఆదేశించింది.

రమేష్‌ కుమార్‌ పిటిషన్‌‌ను మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం వాదించింది. అయితే మాజీ మంత్రి కామినేని తరపున జంధ్యాల రవిశంకర్‌ వాదనలు వినిపించారు. అయితే అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. నెల రోజుల సమయం ఇవ్వడం కుదరదని.. మూడు రోజుల్లో కౌంటర్‌ దాఖలు వేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ హైకోర్టులో పిటిషన్‌ తోపాటు మాజీ మంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరరావు, టీడీసీ తరపున వర్ల రామయ్య, బీజేపీ తరపున మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరో ఇద్దరు కూడా పిటిషన్లు వేయగా అన్ని పిటీషన్ కలిపి విచారిస్తమని తెలిపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories