ఆంధ్రప్రదేశ్ ను చూసి ఇతర రాష్ట్రాలు చాలా నేర్చుకోవాలి : హీరోయిన్ రాశి ఖన్నా

ఆంధ్రప్రదేశ్ ను చూసి ఇతర రాష్ట్రాలు చాలా నేర్చుకోవాలి : హీరోయిన్ రాశి ఖన్నా
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టం చాలా మంచి నిర్ణయమన్నారు ప్రముఖ హీరోయిన్ రాశి ఖన్నా. ఇటువంటి చట్టాలు ఉంటేనే రేపిస్టులు భయపడతారని అన్నారు....

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టం చాలా మంచి నిర్ణయమన్నారు ప్రముఖ హీరోయిన్ రాశి ఖన్నా. ఇటువంటి చట్టాలు ఉంటేనే రేపిస్టులు భయపడతారని అన్నారు. రేపిస్టులకు 21 రోజుల్లో శిక్ష విధించేలా చట్టం రూపొందించడం మంచి ఆలోచన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చూసి ఇతర రాష్ట్రాలు చాలా నేర్చుకోవాలన్నారు రాశి ఖన్నా. దేశంలో అత్యాచారాలకు సత్వర శిక్షలు ఉంటేనే భయం కలుగుతుందని, ఇటువంటి నిర్ణయాలు ఎవరు తీసుకున్నా అభినందించాలి అని ఆమె అభిప్రాయపడ్డారు.

కాగా ఏపీ అసెంబ్లీ సంచలన దిశ బిల్లును గతవారం ఆమోదించింది. దీని ప్రకారం మహిళల పైన ఎవరైనా హత్యాచారానికి.. అఘాయిత్యాలకు పాల్పడితే వారికి 21 రోజుల్లోనే మరణ శిక్ష పడేలా బిల్లులో చేర్చారు. ఘటన జరిగిన తరువాత తొలి ఏడు రోజుల్లోనే ప్రాధమిక సమాచారం సేకరించి విచారణ ప్రారంభిస్తారు. ఆ తరువాత 14 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి కోర్టుకు సమర్పిస్తారు. ఇందుకోసం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రత్యేకంగా పాస్ట్ ట్రాక్ కోర్టులు.. డీఎస్పీ స్థాయి అధికారితో ప్రత్యేక పోలీసుల టీంలు.. అదే విధంగా ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించనున్నారు.

దీంతో పాటు సామాజిక మాధ్యమాల్లో మహిళలపై అసభ్యంగా ఫోస్టింగ్స్ చేసేవాళ్లకి.. రెండు సంవత్సరాల కారాగార శిక్షతో పాటు, లక్ష రూపాయల జరిమానా విధించేలా మరో చట్టం తెచ్చారు. ఈ రెండు బిల్లులను శాసనసభలో ఆమోదించారు. ఇందులో మరణశిక్ష నిర్నయంపై రాష్ట్రపతి ఆమోదం తెలపాల్సి ఉంది. బాధితురాలికి సత్వర న్యాయం జరిగేలా ఈ చట్టం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.

ఇదిలావుంటే బిల్లు తెచ్చిన ఐదో రోజులోనే గుంటూరులో బాలికపై అత్యాచారం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.అభంశుభం తెలియని ఐదేళ్ల బాలికపై లక్ష్మణ్‌ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడటంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై దిశ చట్టం ప్రయోగించాలంటే ఈ చట్టాన్ని ఆమోదం కావాల్సి ఉంది. ఈ కేసుపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. బాధితురాలిని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. నిందితున్ని కఠినంగా శిక్షిస్తామని ఆమె తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories