logo
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh: ఏపీకి హెరాయిన్‌ అక్రమ రవాణా

Heroin Illegal Transport to Andhra Pradesh
X

ఏపీకి అక్రమంగా హెరాయిన్ రవాణా (ఫైల్ ఇమేజ్)

Highlights

Andhra Pradesh: ఆప్ఘన్‌ నుంచి విజయవాడకు స్మగ్లింగ్‌

Andhra Pradesh: ఏపీకి హెరాయిన్‌ రవాణా జరుగుతున్నట్లు గుర్తించారు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు. ఇందుకు సంబంధించి కోట్ల విలువైన హెరాయిన్‌ ఉన్న కంటెయినర్లను గుజరాత్‌ పోర్టులో సీజ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఆప్ఘన్‌లోని కాందహార్‌ కేంద్రంగా పనిచేసే హసన్‌ హుస్సేన్‌ లిమిటెడ్‌ సంస్థ నుంచి టాల్కమ్‌ పౌడర్‌ ముసుగులో వచ్చిన ఈ సరకు ఏపీలోని విజయవాడ కేంద్రంగా పనిచేసే ఆషీ ట్రేడింగ్‌ సంస్థకు వెళుతున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి ఏడుగురు నిందితులు, ఇద్దరు ఆప్ఘన్‌ జాతీయులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కాకినాడ నుంచి విజయవాడ, చెన్నై వరకూ దీని మూలాలు విస్తరించినట్లు తెలుస్తోంది. కాగా కాగితాల్లో మాత్రమే ఈ కంపెనీని నడిపిస్తున్నట్లు వెల్లడైంది. ఇక విజయవాడలోని సత్యనారాయణపురంలో కేంద్ర సంస్థల సోదాలు కొనసాగుతున్నాయి.


Web TitleHeroin Illegal Transport to Andhra Pradesh
Next Story