logo
ఆంధ్రప్రదేశ్

వైసీపీ ఎమ్మెల్సీతో నందమూరి తారకరత్న భేటీ

వైసీపీ ఎమ్మెల్సీతో నందమూరి తారకరత్న భేటీ
X
Highlights

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డితో సినీ హీరో నందమూరి తారకరత్న భేటీ అయ్యారు. శనివారం ప్రభాకర్‌రెడ్డి నివాసంలో..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డితో సినీ హీరో నందమూరి తారకరత్న భేటీ అయ్యారు. శనివారం ప్రభాకర్‌రెడ్డి నివాసంలో మర్యాద పూర్వకంగా ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. జమ్మలమడుగు మండలం గండికోటలో జరుగుతున్న చిత్రం షూటింగ్‌ నిమిత్తం వచ్చిన హీరో నందమూరి తారకరత్న తిరుగు ప్రయాణంలో జమ్మలమడుగు వైఎస్సార్సీపీ నాయకుడు గిరిధర్‌రెడ్డితో కలసి హైదరాబాద్‌కు వెళ్తూ మార్గమధ్యలో ఎమ్మెల్సీ ప్రభాకర్‌రెడ్డి నివాసానికి వచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డితో కాసేపు మాట్లాడారు.

అనంతరం అక్కడినుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నారు తారకరత్న.. ఈ ఏడాది ఆయన సినిమా విడుదల కానున్నట్టు సమాచారం. మరోవైపు ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీలక్ష్మీనరసింహ స్వామిని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి దంపతులు శనివారం దర్శించుకున్నారు. దర్శనం కోసం వచ్చిన దంపతులకు మఠం మేనేజర్‌ వైకుంఠం, ప్రధాన అర్చకులు వేణుగోపాలన్‌ స్వాగతం పలికారు. ఆ తరువాత అహోబిల క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే దంపతులు.

Web Titlehero taraka ratna met ysrcp mlc gangula prabhakar reddy
Next Story