గుంటూరు ఎంపీ అభ్యర్థిని మారుస్తారా..?

గుంటూరు ఎంపీ అభ్యర్థిని మారుస్తారా..?
x
Highlights

సినీనటుడు టాలీవుడ్ అగ్రహీరో అక్కినేని నాగార్జున మంగళవారం వైసీపీ అధినేత వైయస్ జగన్ ను కలవకడం ఆసక్తికరంగా మారింది. పైకి మాత్రం తమ వద్ద రాజకీయ ప్రస్తావన...

సినీనటుడు టాలీవుడ్ అగ్రహీరో అక్కినేని నాగార్జున మంగళవారం వైసీపీ అధినేత వైయస్ జగన్ ను కలవకడం ఆసక్తికరంగా మారింది. పైకి మాత్రం తమ వద్ద రాజకీయ ప్రస్తావన రాలేదని నాగ్ చెబుతున్నా.. చర్చ గుంటూరు ఎంపీ అభ్యర్థి కేంద్రంగానే జరిగినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నాగార్జున కుటుంబం నుంచి ఎవరో ఒకరిని గుంటూరు ఎంపీ బరిలో ఉంచాలని నాగ్ భావిస్తున్నారట. ఒకవేళ ఇది కుదరకపోతే నాగ్ కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తిని పోటీ చేయించాలాని భావిస్తున్నారట. వాస్తవానికి ఈ రూమర్ ఎప్పటినుంచో ఉంది. కానీ తాజాగా నాగార్జున జగన్ ను కలవడంతో ఈ రూమర్ కు బలం చేకూరింది. మరోవైపు నాగార్జున అడిగిన ఈ సీటును జగన్ నిరాకరించారని తెలుస్తోంది.

అక్కడ ఇంచార్జ్ గా ప్రస్తుతం ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, శాసన మండలి ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారు రోశయ్య ఉన్నారు. తనకే టికెట్ వస్తుందని గుంటూరు లోక్ సభ పరిధిలోని అని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తునారాయన. ఈ క్రమంలో నాగార్జున.. జగన్ ను కలవడంతో రోశయ్య వర్గంలో అలజడి మొదలయింది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేసిన జగన్.. గుంటూరు ఎంపీ అభ్యర్థిని కూడా మారుస్తారా అన్న చర్చ జరుగుతోంది. దీనిపై మరింత స్పష్టత రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories