తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. కుండపోత వానలతో సీమ అతలాకుతలం

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. కుండపోత వానలతో సీమ అతలాకుతలం
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు రాయలసీమను ముంచెత్తుతోన్న వానలు కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పొంగి పొర్లుతోన్న వాగులు వంకలు కర్నూలు జిల్లా అతలాకుతలం ఇంకా జలదిగ్బంధంలోనే పలు ప్రాంతాలు పలు ప్రాంతాల్లో నిలిచిన రాకపోకలు కర్నూలు జిల్లా వేలాది ఎకరాల్లో పంటనష్టం వందల కిలోమీటర్ల దెబ్బతిన్న రోడ్లు.

అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా, సీమలో కుండపోత వానలు దంచికొడుతున్నాయి. గత 20ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా రాయలసీమను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దాంతో రాయలసీమ అతలాకుతలమవుతోంది. కర్నూలు, కడప జిల్లాల్లో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.

రాయలసీమలో మరో మూడ్రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని ఆర్టీజీఎస్‌ హెచ్చరించింది. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతరంతోపాటు కృష్ణాజిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఆర్టీజీఎస్‌ అప్రమత్తం చేసింది.

కుండపోత వర్షాలతో కర్నూలు జిల్లా అతలాకుతలమవుతోంది. ప్యాపిలి, పాణ్యం, నంద్యాల, మహానంది, బండిఆత్మకూరు, గోస్పాడు, తుగ్గలి, కోసిగి, మిడుతూరు, ఓర్వకల్లు, మంత్రాలయం మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు, కుందూ నది ఉగ్రరూపం దాల్చడంతో గడివేముల-మిడుతూరు, నంద్యాల-నందికొట్కూరు మధ్య రాకపోకలను నిలిచిపోయాయి. అలాగే, పచ్చర్ల వాగు పొంగడంతో బనగానపల్లి-నంద్యాల మధ్య రాకపోకలు నిలిచాయి. ఇక, నందికొట్కూరులో నక్కలవాగు పొంగడంతో వడ్డెమాన్‌ గ్రామంలో ఇళ్లలోకి నీళ్లు చేరగా, నంద్యాల వీధులన్నీ జలమయమయ్యాయి.

కుండపోత వానలతో కర్నూలు జిల్లా విలవిల్లాడుతోంది. అనేక గ్రామాలు నీట మునగగా, 19 మండలాల్లో 40వేల హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. వరి, వేరుశనగ, పత్తి, మొక్కజొన్న, మినుము, పెసలు వంటి వ్యవసాయ పంటలతోపాటు అరటి, ఉల్లి, టమోటా వంటి ఉద్యాన పంటలు దెబ్బతినడంతో దాదాపు 50కోట్ల మేర నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు తెలంగాణలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్‌, యాదాద్రి, వికారాబాద్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో వాన దంచికొడుతోంది. యాదాద్రిలో 12 మండలాలు నల్గొండలో 13 మండలాలు సూర్యాపేటలో 20 మండలాల్లో కుంభవృష్టి కురిసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories