నేటి నుంచి మూడ్రోజుల పాటు దక్షిణాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు

నేటి నుంచి మూడ్రోజుల పాటు దక్షిణాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు
x
Highlights

పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా నివర్‌ కేంద్రీకృతమైంది. రేపు సాయంత్రానికి పుదుచ్చేరి సమీపంలోని మమాళ్లపురం-కరైకల్ మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

నివర్‌ తుఫాన్‌ దూసుకొస్తోంది. ఇవాళ సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శా‍ఖ హెచ్చరించింది. పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా నివర్‌ కేంద్రీకృతమైంది. రేపు సాయంత్రానికి పుదుచ్చేరి సమీపంలోని మమాళ్లపురం-కరైకల్ మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీరందాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు.

తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమపై నివర్ తీవ్ర ప్రభావం చూపనుంది. నేటి నుంచి మూడ్రోజుల పాటు దక్షిణాంధ్ర, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో తుఫాన్‌ ప్రభావం అధికం ఉండనుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అలాగే.. తెలంగాణలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

నివర్‌ తుఫాన్‌ దృష్ట్యా ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో నివర్‌ ఎఫెక్ట్‌ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో.. ఆయా జిల్లాల యంత్రాంగాన్ని అలర్ట్‌ చేసింది. వ్యవసాయ, వైద్యారోగ్య, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శా‍ఖలను అందుబాటులో ఉంచింది. వీలైనంత త్వరగా పంట కోతలు చేపట్టాలని రైతులను సూచించింది. అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఆదేశాలిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories