తెలుగురాష్ట్రాల్లో కుంభవృష్టి... అంధకారంలో అనంతపురం

తెలుగురాష్ట్రాల్లో కుంభవృష్టి... అంధకారంలో అనంతపురం
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర‌్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లా గుత్తిలో రాత్రి ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది.డ్రైనేజీ కాలువల నీరు పొంగిపొర్లి రోడ్లపై ప్రవహించింది. సమీపంలోని వాగులు అలుగు తీశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

అనంతపురంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనంతపురం చాపలలో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది. యాడికి మండలం లక్ష్మాంపల్లెలో ఒక ట్రాక్టర్, పలు ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకు పోయాయి. గ్రామాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజాలు అవస్థలు పడుతున్నారు.

గుత్తి పట్టణంలో భారీ వర్షానికి జనవాసాలలోకి కొండచిలువ ప్రవాహంలో కొట్టుకు వచ్చింది.భయంతో స్థానికులు కొండచిలువను చంపేశారు.పెద్దవడుగూరు మండలం వెంకటాంపల్లి గ్రామంలో వర్షానికి గుడిసె కూలడంతో ఏడు సంవత్సరాల చిన్నారి మృతి చెందింది. యాడికి మండలం వేములపాడులో కస్తూరిబా పాఠశాలలోకి భారీగా వర్షపునీరు చేరడంతో పాఠశాల ప్రహరీ గోడ కూలిపోయింది. ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను పామిడి కస్తూరిబా పాఠశాలకు తరలించారు.

వజ్రకరూరు, బెళుగుప్ప, విడపనకల్లు మండలంలో భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.డోనేకల్ల్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బళ్లారి-గుంతకల్లు రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories