Srikakulam: వరదల్లో పంట నష్టం, రైతుల ఆవేదన

Srikakulam: వరదల్లో పంట నష్టం, రైతుల ఆవేదన
x
Highlights

వాయుగుండం ప్రభావంతో ఒడిషాలో కురిసిన వర్షాల వల్ల శ్రీకాకుళం జిల్లాలో వంశధార, మహేంద్ర తనయ నది కొచ్చిన వరదల వల్ల అన్నదాత పై తీవ్ర నష్ట ప్రభావం చూపింది.

వాయుగుండం ప్రభావంతో ఒడిషాలో కురిసిన వర్షాల వల్ల శ్రీకాకుళం జిల్లాలో వంశధార, మహేంద్ర తనయ నది కొచ్చిన వరదల వల్ల అన్నదాత పై తీవ్ర నష్ట ప్రభావం చూపింది. ఈ వరదలు భీభత్సం పాతపట్నం నియోజకవర్గంపై తీవ్ర ప్రభావం చూపింది. కొత్తూరు, హిరమండలం, LN పేట మండలాల పరిధిలో వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. పొట్టదశలో ఉన్న వరిపైరు పొలాల్లోలో నీరు నిల్వ ఉండిపోవడంతో నష్టం అధికంగా ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఇప్పటికీ అధికారులు పంట నష్టాలను అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. కొన్ని గ్రామాల్లో పొలాల్లోకి అధికారులు వెళ్లలేని పరిస్థితి. దీంతో వరద తీవ్రత నష్ట అంచనాలు పరిస్థితి నత్తనడకన సాగుతోంది. రైతులు ఎవరూ ఇబ్బంది పడనక్కర్లేదని.. క్షేత్రస్థాయిలో పర్యటిస్తామని, రెవెన్యూ అధికారుల సహకారంతో వాస్తవాలు నమోదు చేస్తామని వ్యవసాయ అధికారులు తెలుపుతున్నా.. రైతుల్లో ఆందోళనలు తగ్గడం లేదు.



ఎల్ఎన్ పేట, బసవరాజుపేట, మిరియాపల్లి, దబ్బపాడు గ్రామాల్లో 200 ఎకరాలకు పైగా వరి, మొక్కజొన్నకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనాలకు వచ్చారు. ఇక కొత్తూరు మండలంలోని సిరుసువాడ, కుంటిభద, వసప, నివగాం, మదనాపురం, సోమరాజపురం, ఆకులతంపర, హంస, మాతల, మాకవరం, పొన్నుటూరు పంచాయతీల్లో రైతులకు తీవ్ర నష్టం మిగిల్చాయి. దాదాపు 2 వేల ఎకరాల్లో వరి, అరటి, మొక్కజొన్న, చెరకు, కూరగాయల పంటలు మునిగిపోయాయి. ఇప్పటికీ పంటల వద్దకు వెళ్లలేని దుస్థితి. హిరమండలం మండలంలోని గులుమూరు, గొట్టా, చొర్లంగి, అక్కరాపల్లి, తుంతపంపర, కల్లట, జిల్లేడుపేట, కోరాడ, సుభలాయ గ్రామాల్లో సుమారు 800 ఎకరాల్లో వరి, కూరగాయల పంటలు నీట మునిగాయి.


నరసన్నపేట నియోజకవర్గంలో పోలాకి మండలంలో 25 గ్రామాల్లో వరిపంట నీటి మునగడం ఇంకా వరద నీరు వెళ్లకపోవడంతో మోకాలిలోతు నీటిలో ఇంకా వరిపంట ఉంది...అందులో బురద నీరు వల్ల వరి పంట పాడయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. అలాగే బూర్జ మండలంలో నాగావళి వరద నీటి వల్ల ఉద్యాన వనపంటలైన ఆకుకూరలు, తీగజాతి పంటలు, మొక్కజొన్న పంట ఈదురుగాలులకు నెలకొరిగాయని.. బురదనీటిలో మిగతా పంటలు పాడయ్యాయనేది ప్రాధమిక అంచనాకు ఉద్యానవన పంటల అదికారులు వచ్చారు. అలాగే సరుబుజ్జిలి ఉన్న రోడ్లపై వరద నీటి వల్ల ఆ ప్రాంతమంతా మెయిన్ రోడ్డు గోతుల మయం అలాగే మొక్కజొన్న పంట, ఉద్యానవన పంటలు సుమారు 100 ఎకరాల పంట వరద నీటిలో ఇంకా ఉందని తెలుస్తుంది. అలాగే శ్రీకాకుళం రూరల్ మండలం, గార మండలంలో స్వల్ప నష్టం వాటిలిందని వ్యవసాయశాఖ అదికారులు లెక్కల్లో చూపుతున్నారు..


రైతులు మాత్రం లైన్లలో నిలబడి యూరియా కోసం కొట్లాటకు దిగి తెచ్చిన ఎరువులను పొలంలో వేయడం మరుసటి రోజే వరద ముంచెత్తడంతో వేసిన ఎరువులు మొత్తం వరదనీటి పాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు ఆ విపత్తును ఎదుర్కొనేలా సూచనలు... రక్షణ గోడ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉంటే బాగుండేదనే వాదనలు వినిపిస్తున్నాయి. యుద్ద ప్రాతిపదికన జిల్లా నాయకులు, అధికారులు వంశదార, నాగావళి, మహేంద్రతనయ నదుల దగ్గర బలహీనంగా ఉన్న పరీవాహక ప్రాంతాల్లో గట్టలను ఇసుక బస్తాలు కాకుండా పూర్తి స్తాయి రక్షణ గోడ నిర్మించాలని రైతులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories