ఏపీ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు

Heavy Rains Across AP | Andhra News
x

ఏపీ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు

Highlights

AP News: తీరం వెంట 40-50 కి.మీ.వేగంతో ఈదురుగాలులు

AP News: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు. మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దవుతోంది. నదులు, వాగులు వంకలు పొంగిపొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

వర్షాలతో ఏపీ అల్లాడుతుంటే వాతావరణ శాఖ మరో కీలక ప్రకటన చేసింది. ఒడిశా-ఏపీ తీరం మీదుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజుల క్రితం వరకు ఏపీ మీదుగా తెలంగాణ, మహారాష్ట వైపు కదిలిన అల్పపీడనం భూమిపైనే ఎక్కువగా కొనసాగుతోందని నాలుగైదు రోజుల పాటు అల్పపీడనంగానే కొనసాగుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రుతుపవనాలు కూడా చురుగ్గా కదుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.

అల్పపీడనం, రుతు పవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో రెండు రోజుల పాటు ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయి. మరీ ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో కుంభవృష్టి కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15 జిల్లాలపై వర్షాల ప్రభావం తీవ్రంగా ఉండనుందని అల్పపీడనం ప్రభావంతో రెండు రోజుల పాటు ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది.

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో కుంభవృష్టి కురిసే అవకాశముందని రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15 జిల్లాలపై వర్షాల ప్రభావం తీవ్రంగా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ 2 నుంచి 6 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయింది. విశాఖపట్నం నుంచి నెల్లూరు జిల్లాల వరకు అత్యధికంగా 6 సెంటీమీటర్లలో వర్షపాతం నమోదు కాగా రాయలసీమ జిల్లాల్లో మాత్రం 2సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories