తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన
x
Highlights

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచన చేసింది....

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచన చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని.. అలాగే కోస్తాంధ్ర, రాయలసీమలోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్టు పేర్కొంది. కోస్తాంధ్రలో పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలావుంటే ఇప్పటికే ఎగువన కురిసిన వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories