కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన.. ఆ ప్రదేశాల్లో ఉండొద్దు..

కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన.. ఆ ప్రదేశాల్లో ఉండొద్దు..
x
Highlights

కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన.. ఆ ప్రదేశాల్లో ఉండొద్దు.. కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన.. ఆ ప్రదేశాల్లో ఉండొద్దు..

కొమెరిన్‌ తీరం నుంచి తమిళనాడు, రాయలసీమ మీదుగా కోస్తా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. కోస్తా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని.. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. సముద్రం నుంచి తేమగాలులు భారీగా వీస్తాయని తెలిపింది. అలాగే, కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.

రానున్న 24 గంటల్లో కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని.. అందువల్ల ఎవరు నిర్జన ప్రదేశాల్లో ఒంటరిగా ఉండరాదని ఎత్తైన ప్రదేశాలు, ఎత్తైన చెట్ల వద్ద ఉండవద్దని అధికారులు సూచించారు. కోస్తాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా గత రెండు రోజులుగా కోస్తాలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories