Top
logo

ప్రకాశం జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం..

ప్రకాశం జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం..
X
Highlights

బుధవారం ప్రకాశం జిల్లాలో వడగండ్ల వాన కురిసింది. దీంతో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ప్రకాశం జిల్లా దొనకొండతోపాటు...

బుధవారం ప్రకాశం జిల్లాలో వడగండ్ల వాన కురిసింది. దీంతో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ప్రకాశం జిల్లా దొనకొండతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం రాత్రి అరగంట పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. దీంతో రహదారులపై చెట్లు చెల్లాచెదురుగా విరిగిపడ్డాయి. రాజకీయపార్టీల ఫ్లెక్సీలు గాల్లో పైకి లేచి ఇళ్ల మీద పడ్డాయి. పొలాల్లో మిర్చి ఆరబెట్టుకున్న రైతులు ఆకస్మాత్తుగా వర్షం కురవటంతో పట్టలు కప్పుకోవడానికి ఇబ్బందులు పడ్టారు.ఈ క్రమంలో కొందరి రైతుల మిర్చి పూర్తిగా తడిసి ముద్దయింది. వర్షం కారణంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. ఇదిలావుంటే వడగండ్ల వాన ధాటికి యర్రబాలెం గ్రామానికి చెందిన మహిళ తీవ్రంగా గాయపడింది. దాంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు.

Next Story