logo

కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు

కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు
Highlights

నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుంది. ఫలితంగా రానున్న 24గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల...

నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుంది. ఫలితంగా రానున్న 24గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర జార్ఘండ్‌, బిహార్‌ ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతుండడంతో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల సోమవారం భారీ వర్షాలు పడ్డాయి. ప్రకాశం జిల్లా మార్కాపురంలో 8, సింగరాయకొండ, ఒంగోలు, గంట్యాడలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. సోమవారం మధ్యాహ్నం నుంచి పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు పడడంతో పలు గ్రామాల్లో రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.


లైవ్ టీవి


Share it
Top