అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వీడని వాన.. కోతకు గురవుతున్న లంక ప్రాంతం

Heavy Rain In  Ambedkar Konaseema District
x

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వీడని వాన.. కోతకు గురవుతున్న లంక ప్రాంతం

Highlights

*గోదావరిలోకి కొట్టుకుపోతున్న భారీ వృక్షాలు, కొబ్బరి చెట్లు

Ambedkar Konaseema: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో డాక్టర్‌ BR అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అతలాకుతలం అవుతోంది. బంగాళాఖాతం తీరం వెంబడి సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతూ తీర ప్రాంతాల్లోకి చొచ్చుకు వస్తున్నాయి. ఫలితంగా ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామంలో గోదావరి నదీ కోతకు గురవుతోంది. దీంతో భారీ వృక్షాలు, కొబ్బరి చెట్లు గోదావరిలోకి కొట్టుకుపోతున్నాయి. సుమారు 50 కుటుంబాలు ప్రమాదపుటంచున ఉన్నాయి. కోతకు గురవుతున్న ప్రాంతంలో చర్యలు చేపట్టాలని లంక వాసులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories